సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: ఐకాన్ స్టార్‌తో బోయపాటి మాస్ మ్యాజిక్?

ABN, Publish Date - Oct 05 , 2026 | 02:37 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో 'సరైనోడు' బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌ లో 'సరైనోడు' బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.  వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందని, గీత అర్త్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. అయితే  బోయపాటి తెరకెక్కించిన 'అఖండ -2' చిత్రం ఫలితం తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా ఉండదనే టాక్ కూడా వచ్చింది.  అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమాపై వార్తలు జోరందుకున్నాయి. బోయపాటి, అల్లు అర్జున్ కలయికలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే దిశగా చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా తనదైన మాస్ యాక్షన్ కథతో సిద్ధంగా ఉన్నట్లు టాక్. కథ చర్చలు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని అనుకున్నట్లే జరిగితే త్వరలోనే గీత ఆర్ట్స్ సంస్థ నుంచి  అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బోయపాటి స్టైల్ మాస్ ఎలివేషన్స్‌కు, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. 

Also Read:

నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది

'సప్త సాగరాలు సప్త గిరులు'గా తెలుగులో...

నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్

Updated Date - Oct 05 , 2026 | 05:03 PM