Allu Aravind: అల్లు అరవింద్ టంగ్ పవర్.. రుహానీకి వర్కౌట్ అవుతుందా?
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:33 PM
సినిమా వేడుకల్లో హీరోహీరోయిన్లను పెద్దలు ఆశీర్వదించడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ నిర్మాత అల్లు అరవింద్ ఆశీర్వాదానికి ఓ ప్రత్యేకత ఉంది.
సినిమా వేడుకల్లో హీరోహీరోయిన్లను పెద్దలు ఆశీర్వదించడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఆశీర్వాదానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఒక సెంటిమెంట్‌గా కూడా మారిపోయింది. ఆయన ఆశీస్సులు అందుకున్న హీరోయిన్లకు పెళ్లి జరిగిపోతుందనే సరదా చర్చ నడుస్తోంది. అది కూడా తెలుగు అబ్బాయితోనే. అందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. గతంలో లావణ్య త్రిపాఠి, రష్మిక మందన్న విషయంలో జరిగినట్లుగానే తాజాగా మరో హీరోయిన్‌కు కూడా ఆయన పెళ్లి ఆశీస్సులు అందించారు. ఆమె మరెవరో కాదు.. రుహానీ శర్మ.
‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో కీలక పాత్ర పోషించిన రుహానీ శర్మకు ఇటీవల అల్లు అరవింద్ ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా ఆమెను సరదాగా పలకరించిన ఆయన.. ప్రస్తుతం ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అని అడిగారు. అందుకు రుహానీ లేదన్నట్లుగా తల ఊపడంతో.. త్వరలోనే నీకు పెళ్లవుతుందని ఆశీర్వదించారు. అంతేకాదు.. హైదరాబాద్ అబ్బాయితోనే నీ వివాహం జరుగుతుందని కూడా సరదాగా దీవించారు. అల్లు అరవింద్ మాటలకు రుహానీ కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అల్లు అరవింద్ ఆశీర్వాదాలకు సంబంధించి గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన లావణ్య త్రిపాఠిని ఆయన గతంలో ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆమె మెగా కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ జంట వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
అలాగే ‘భీష్మ’ సినిమా ఈవెంట్‌లో రష్మిక మందన్నను కూడా అల్లు అరవింద్ దీవించారు. ఆ తర్వాత ఆమె విజయ్ దేవరకొండను వివాహం చేసుకోవడంతో ఈ సరదా సెంటిమెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ కపుల్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల నటి మృణాల్ ఠాకూర్‌కు కూడా అల్లు అరవింద్ ఆశీర్వాదం అందించడంతో ఆమె పెళ్లి గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పుడు రుహానీ శర్మకు కూడా ఆయన పెళ్లి ఆశీస్సులు అందించడంతో ఈ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది.
ఇలా ఆయన ఆశీర్వదించిన హీరోయిన్ల జీవితాల్లో పెళ్లి ముచ్చట్లు వినిపిస్తుండటంతో.. అల్లు అరవింద్ ఆశీర్వాదం అందుకుంటే పెళ్లి యోగం పట్టినట్లేనా? అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మరి రుహానీ శర్మ విషయంలోనూ ఈ సెంటిమెంట్ నిజమవుతుందా? హైదరాబాద్ అబ్బాయితో ఆమె పెళ్లి ఎప్పుడు కుదురుతుందా? అనేది చూడాలి.
ALSO READ:
విశాల్‌తో.. ఇక సినిమాలు చేయను! మిష్కిన్ సంచలన వ్యాఖ్యలు!
దర్శకుడిగా మారుతున్న గీత రచయిత కళ్యాణ చక్రవర్తి
ఒకరు శ్రీకాళహస్తిలో.. మరొకరు తిరుమలలో.. ఆలయాల బాట పట్టిన స్టార్స్!