అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..
ABN, Publish Date - Aug 08 , 2026 | 08:56 PM
విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అల్లరి నరేష్.. ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో రెడీ అవుతున్నారు.
విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అల్లరి నరేష్ (Allari Naresh).. ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ ‘రంభ ఊర్వశి మేనక’ (Ramba Oorvasi Menaka)తో రెడీ అవుతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ‘Comedy Goes Cosmic’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘నా కంటి మీద కునుకే’, పోస్టర్స్ అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ అప్డేట్‌ను ఇచ్చారు. ఆగస్ట్ 10న టీజర్‌ని లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ వదిలారు. ఈ టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు ఇద్దరూ చిరునవ్వుతో కనిపించడం ఫీల్ గుడ్ వైబ్‌ని తీసుకొచ్చింది. ఇందులో అల్లరి నరేష్ మాల ధరించి ఉన్నారు. వెన్నెల కిశోర్, వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితర ప్రముఖ నటులు.. తమదైన కామెడీ టైమింగ్‌తో సినిమాకు మరింత వినోదాన్ని అందించనున్నారు.
ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీతో మళ్లీ అల్లరి నరేష్ తనదైన సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడని, అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
స్వాతంత్య్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ట్రీట్ ఇదే!
బర్త్‌డే స్పెషల్.. నటవారసుల్లో మహేష్ బాబు స్థాయే వేరు!
‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ వేడుక ఎక్కడంటే..