Alcohol: అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ ఎక్కేది ఎప్పుడంటే
ABN, Publish Date - Nov 12 , 2026 | 01:59 PM
అల్లరి నరేష్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆల్కహాల్’.
అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆల్కహాల్’(Alcohol). చిత్రమిది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మనిషి ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాలు నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అల్లరి నరేష్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా స్టైలిష్, సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు. అసలు ఈ సినిమా ఈ ఏడాది జనవరి 1న విడుదల కావలసింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా 12 నెలలు వాయిదా పడి ఎట్టకేలకు డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అల్లరి నరేష్ సరసన రుహానీ శర్మ నటిస్తుండగా, నిహారిక ఎన్ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి దామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ALSO READ:
Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!
Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?
Anil Ravipudi: ఓవర్సీస్లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..
Jyothika: మా పరిధిని మరింతగా విస్తరించే ధైర్యాన్ని ఇచ్చారు