Anil Ravipudi: ఓవర్సీస్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..

ABN , Publish Date - Nov 12 , 2026 | 08:34 AM

సంక్రాంతి సీజన్ కు రారాజు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. రానున్న సంక్రాంతికి కూడా ఒక సినిమా లైన్లో పెట్టారు. 

సంక్రాంతి సీజన్ కు రారాజు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). రానున్న సంక్రాంతికి కూడా ఒక సినిమా లైన్లో పెట్టారు. విక్టరీ వెంకటేష్ (Venkatesh), అనిల్  రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం  ‘జనవరి 12 విడుదల' (January 12 vidudala) . షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు సినిమా ప్రమోషన్ల విషయంలోనూ చిత్ర బృందం వినూత్నంగా ముందుకెళ్తోంది. సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం  ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు మేకర్స్.  

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. అమెరికాలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు నిర్వహించని స్థాయిలో భారీ ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ మొత్తం అమెరికాలో పర్యటించనుంది. డిసెంబర్ 26, 27 తేదీల్లో చికాగోలో అభిమానులతో సందడి చేయనుండగా.. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఆస్టిన్, డల్లాస్ నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో అమెరికాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్  అభిమానులకు సందడి చేయనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్‌కు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

ALSO READ:

Jyothika: మా పరిధిని మరింతగా విస్తరించే ధైర్యాన్ని ఇచ్చారు
వాళ్లను కలుసుకోవాలని ఉబలాటపడుతోన్న కాజల్

ఆ సినిమాలతో పోటీ పడనున్న 'భోగి'..

Updated Date - Nov 12 , 2026 | 08:53 AM