సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Buchi Babu Sana: పెద్ది చూశాక.. సురేఖ, సుస్మితలు కాల్ చేసి ఏడిచేశారు

ABN, Publish Date - Jun 15 , 2026 | 07:28 AM

పెద్ది మూవీ చూశాక సురేఖ, సుస్మితలు కాల్ చేసి ఏడిచేశార‌ని బుచ్చిబాబు సానా అన్నారు.

peddi Buchi Babu Sana

‘పెద్ది’ (Peddi) సినిమాలో రామ్‌చరణ్ (Ram Charan) నటనకు అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి గొప్ప కంటెంట్‌ ఉన్న సినిమాలు మరిన్ని రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. పెద్ది మూవీ చూశాక సురేఖ, సుస్మితలు కాల్ చేసి ఏడిచేశార‌ని అన్నారు. ‘పెద్ది’ విషయంలో మా నమ్మకాన్ని నిజం చేశారు ప్రేక్షకులు. ఈ చిత్రానికి ఇంతటి ఘనవిజయం అందించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ బుధవారం నుంచి సినిమాలో కొన్ని కొత్త సన్నివేశాలను జతచేస్తున్నాం’ అని దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) అన్నారు.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకటసతీశ్‌ కిలారు నిర్మించిన చిత్రమిది. నిర్మాణ సంస్థలు మైత్రీమూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు మేకర్స్‌.

ఈ కార్యక్రమంలో వెంకటసతీశ్‌ కిలారు (Venkata Satish Kilaru) మాట్లాడుతూ ‘పెద్ది’లాంటి అద్భుతమైన కథాంశం ఉన్న చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉంది. అన్ని చోట్లా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది’ అని చెప్పారు. మైత్రీ శశి మాట్లాడుతూ ‘ఈ తరానికి అవసరమైన చిత్రమిది. ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తి నింపుతోంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత అనంత శ్రీరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 07:28 AM