సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘అదే నీవు అదే నేను’ రిలీజ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

ABN, Publish Date - Jul 23 , 2026 | 03:26 PM

శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్న ‘అదే నీవు అదే నేను’ మూవీ విడుదల తేదీ ఫిక్సయింది. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు కొండల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Adhe Neevu Adhe Nenu Ready to Release

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) చిత్రంలో నటించిన త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల.. ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా ‘అదే నీవు అదే నేను’ (Adhe Neevu Adhe Nenu). ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు కొండల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా.. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.


‘అదే నీవు అదే నేను’ చిత్రాన్ని ఈ నెల 31న (Adhe Neevu Adhe Nenu Release Date) గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ ‘1 మిలియన్ వ్యూస్’తో డిజిటల్ మీడియాలో దూసుకెళ్తోంది. అలాగే, స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ చేతుల మీదుగా లాంఛ్ చేసిన ‘మనసా మనసా’ సాంగ్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది.


ఇంకా ఈ చిత్రం నుంచి ‘మధురమా’ అంటూ సాగే పాటను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ పూరి, నటి ఇంద్రజలతో పాటు.. చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖుల బెస్ట్ విశెస్ అందుకున్న ఈ సినిమాను కుటుంబ సమేతంగా అందరూ థియేటర్లలో చూడాలని నిర్మాత కోరుతున్నారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగే సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తిని పంచేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు కొండల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Jana Nayakudu: విజయ్‌ జన నాయకుడు రివ్యూ

మా అన్నయ్య మెగాస్టార్‌కు.. నేను పవర్ స్టార్‌కు అభిమానులం: కిరణ్ అబ్బవరం

మా రమేష్ మాకు కావాలి సార్.. పవన్, హరీష్ శంకర్‌లకు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి విన్నపం

Updated Date - Jul 23 , 2026 | 03:26 PM