మహిళా సాధికారత నేపథ్యంలో ‘అభయ’.. టైటిల్ పోస్టర్ ఇదే!
ABN, Publish Date - Jun 14 , 2026 | 07:29 PM
యోగిత భోసాలె ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటోన్న మహిళా సాధికారిక చిత్రానికి ‘అభయ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
యోగిత భోసాలె (Yogita Bhosale) ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటోన్న మహిళా సాధికారిక చిత్రానికి ‘అభయ’ (Abhaya) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, గ్రాండియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్, ఆర్.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన శ్రీ రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యూసఫ్ ముజామ్మిల్ సుర్తి దర్శకత్వంలో తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మహిళా సాధికారితపై రూపొందుతోన్న పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ఇదని తెలుస్తోంది.
యోగిత భోసాలె ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో మోహన్ జోషి, గణేష్ యాదవ్, కమలేష్ సావంత్, అనికేత్ కేల్‌కర్, రోహిత్ కోకటి, ఉమేష్ బోల్కె, డా. సంజీవ్ కుమార్ పాటిల్, హర్ష్ నికమ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక టైటిల్ పోస్టర్ విడుదల సందర్భంగా గ్రాండియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ అధినేత, నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ.. ‘అభయ’ కేవలం సినిమా మాత్రమే కాదు.. సమాజానికి ఇవ్వబోతున్న ఒక బలమైన సందేశం. ఈ మూవీ ద్వారా తరతరాలుగా ఎందరికో ప్రేరణగా నిలుస్తోన్న మహిళల శక్తి, పట్టుదలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం. టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయటం ఆనందంగా ఉంది. సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.
RDG ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, నిర్మాత శ్రీ రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ.. మా ‘అభయ’ టైటిల్ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ఒక అర్థవంతమైన సందేశాన్ని అందించడమే కాకుండా.. బలమైన కథనం, అద్భుతమైన నటీనటులతో రూపుదిద్దుకుంటోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!
బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్