సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘వదలా’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

ABN, Publish Date - Jul 11 , 2026 | 09:34 AM

వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ప్రధాన పాత్రలో, ప్రముఖ నటి లయ కథానాయికగా నటించిన ఎమోషనల్ సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’ జూలై 17న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ మూవీ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ..

Vadala Movie Team interview

వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ప్రధాన పాత్రలో, ప్రముఖ నటి లయ కథానాయికగా నటించిన ఎమోషనల్ సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’ జూలై 17న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించిన ఈ చిత్రానికి అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. దాదాపు 24 ఏళ్ల క్రితం ‘మనోహరం’ వంటి సూపర్ హిట్ చిత్రంలో జంటగా నటించిన జగపతి బాబు, లయల కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది కావడంతో ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రబృందంతో NSR స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం..


ఈ ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. తాను కేవలం ఒక హీరోగా డ్యాన్సులు చేసే పాత్రలు కాకుండా, ఒక ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకునేందుకు ఈ సస్పెన్స్ కథను ఎంచుకున్నట్లు తెలిపారు. ఒక సుఖవంతమైన ఫ్యామిలీలోకి ఒక యువతి ప్రవేశించి ఎలాంటి అలజడి సృష్టించింది అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా సాగుతుందని, ఇందులో హృతికా శ్రీనివాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో అద్భుతంగా నటించిందని పేర్కొన్నారు. నిర్మాతలను సేవ్ చేయాలనే కసితో ఈ సినిమా మేకింగ్‌లో తాను ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్లు కూడా ఆయన వెల్లడించారు.


నటి లయ మాట్లాడుతూ.. ఇది తన కెరీర్‌లోనే పూర్తి స్థాయి సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ ఉన్న భిన్నమైన చిత్రమని, ఆడియన్స్ సరికొత్త అనుభూతిని ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

గాడ్ ఆఫ్ వార్: త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్

మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్‌కు గూస్‌బంప్స్!

Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్‌

Updated Date - Jul 11 , 2026 | 09:34 AM