సీనియర్ నటి మంజు భార్గవితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ
ABN, Publish Date - Jul 31 , 2026 | 06:40 PM
తెలుగు సినీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ‘శంకరాభరణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ సీనియర్ నటి, నాట్యమయూరి మంజు భార్గవి. ఆమెతో NSR స్పెషల్ ఇంటర్వ్యూ.
తెలుగు సినీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ‘శంకరాభరణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ సీనియర్ నటి, నాట్యమయూరి మంజు భార్గవి (Manju Bhargavi). ప్రస్తుతం ఆమె ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో సుదీర్ఘమైన తన 52 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించి ఎన్నో తీపి జ్ఞాపకాలను, అనుభవాలను NSR స్పెషల్ ఇంటర్వ్యూలో నటి మంజు భార్గవి షేర్ చేసుకున్నారు.
ముందుగా తను నటిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi) సినిమా గురించి మంజు భార్గవి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఏడు తరాల పగను ప్రతిబింబించే అత్యంత పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ కుటుంబ పెద్ద పాత్రను పోషిస్తున్నాను. ఈ కథలో డివైన్ పవర్ (వారాహి అమ్మవారి అనుగ్రహం) ఎంతగానో కనిపిస్తుంది. షూటింగ్ సమయంలో సెట్స్‌లో నిజంగానే వారాహి అమ్మవారి పూనకం వచ్చిందేమో అన్నంత ఆవహించిన వాతావరణం, వైబ్రేషన్స్ కలిగాయి. ఇటీవల కాలంలో రాబోతున్న ఒక అద్భుతమైన డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది’’ అని తెలిపారు.
తన సినీ ప్రయాణంలో ‘శంకరాభరణం’ స్థానం గురించి చెబుతూ.. దర్శకుడు విశ్వనాథ్‌తో పని చేయడం, జేవీ సోమయాజులుతో నటించిన సన్నివేశాలు ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. కళారంగంలో డాన్స్, నటన రెండూ తనకు ప్రాణ సమానమని, క్లాసికల్ డాన్స్‌పై ప్రస్తుతం తగ్గుతున్న అంకితభావం పట్ల ఆమె కొంత ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే ‘ది రెబెల్ డాన్సర్’ అనే టైటిల్‌తో తన జీవిత కథ పుస్తకాన్ని, దానితో పాటు క్యూఆర్ కోడ్ ఆధారిత వీడియో ప్రాజెక్ట్‌ను కూడా ప్రచురించబోతున్నట్లు మంజు భార్గవి వెల్లడించారు. ఇంకా తన లైఫ్‌లో జరిగిన ఎన్నో విషయాల గురించి ఆమె తెలిపారు. అవేంటో తెలియాలంటే పై వీడియో చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
సంగీత ప్రపంచంలోనూ రాజకీయాలుంటాయని తెలిసొచ్చింది - గాయని జమునారాణి చివరి ఇంటర్వ్యూ
మోక్షజ్ఞ కంటే ముందే.. బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ!
మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్