మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , Publish Date - Jul 31 , 2026 | 02:47 PM

దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Agadha Movie New Still

దర్శకుడు ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ (Agadha). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఎలా ఆసక్తి పెరుగుతుందో తెలియంది కాదు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌.. మంచి స్పందనను రాబట్టుకోవడంతో పాటు, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. రీసెంట్‌గానే చిత్ర ప్రమోషన్స్ జాతరను బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో మేకర్స్ ప్రారంభించారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ (Agadha Trailer)ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.


ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్ట్ 3న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌‌ని గమనిస్తే.. అడవి నడుమ మర్మమైన వాతావరణంలో నిలబడి ఉన్న ఓ స్త్రీ సాధువు రూపం.. సినిమా కథలో దాగి ఉన్న రహస్యాలపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. ‘అగధ’ ప్రేక్షకులను ఓ విభిన్నమైన ఆధ్యాత్మిక మిస్టరీ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుందనే సంకేతాలను ఈ పోస్టర్ ఇస్తుందనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అజయ్ కె.ఆర్. సమర్పిస్తున్నారు. కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను ఎం.ఎస్. రాజు నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో సంచలనం సృష్టించిన ఈ చిత్రం.. ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

Karmaakhya Movie reveiw: కర్మాఖ్య మూవీ రివ్యూ

సైమా 14వ ఎడిషన్‌ నామినేషన్స్‌లో ఈ తెలుగు చిత్రాలదే హవా..

మహేష్ సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది: సుమంత్

Updated Date - Jul 31 , 2026 | 02:47 PM