‘ఇరుముడి’ దర్శకుడు శివ నిర్వాణతో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

ABN , Publish Date - Aug 21 , 2026 | 10:29 AM

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్ర దర్శకుడితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ.

NSR Special Interview with Irumudi Director Shiva Nirvana

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ప్రధాన పాత్రలో ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘NSR’ స్పెషల్ ఇంటర్వ్యూ (NSR Special Interview)లో శివ నిర్వాణ (Shiva Nirvana) పాల్గొని సినిమా విశేషాలు, తెరవెనుక అనుభవాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో విడుదలైన ‘మల్లెపూల పల్లకి’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో అయ్యప్ప భక్తుల భజనలలో శాశ్వతంగా నిలిచిపోయేలా జీవీ ప్రకాష్ కుమార్‌తో కలిసి ప్రత్యేక శ్రద్ధతో పాటలను డిజైన్ చేశామని శివ తెలిపారు.


ఈ సినిమా కథ పుట్టుక గురించి చెబుతూ.. ‘‘41 రోజుల పాటు అయ్యప్ప స్వామి మాలలో ఉండే ఒక వ్యసనపరుడైన వ్యక్తి జీవితంలో జరిగే పరిస్థితులు, సంఘర్షణలే ఈ కథకు మూలం. ఇది కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు, ఒక విలన్ లేకుండా పరిస్థితుల చుట్టూ తిరిగే అత్యంత ఇంటెన్స్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. రవితేజ ఇప్పటివరకు చేయని విధంగా చాలా సహజమైన, సెటిల్డ్ నటనతో త్రినాధ్ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు’’ అని వివరించారు. సీలేరు వంటి మారుమూల అటవీ ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ కూడా లేని వాతావరణంలో చిత్రయూనిట్ మొత్తం ఎంతో సహజంగా కలిసిపోయి షూటింగ్ పూర్తి చేసుకున్నామని గుర్తుచేసుకున్నారు.


పాప నక్షత్ర పాత్ర సినిమాకు ప్రాణమని, ప్రియా భవానీ శంకర్, శ్వాసిక, సాయికుమార్ తదితరుల పాత్రలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని శివ నిర్వాణ ధీమా వ్యక్తం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే తెలుగుతో పాటు కేవలం తమిళంలో మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. తన కెరీర్‌లో ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా శివ నిర్వాణ చెప్పిన చిత్ర విశేషాల కోసం పై వీడియోలో ఉన్న ఫుల్ ఇంటర్వ్యూ చూడండి.

ఇవి కూడా చదవండి:

సమాజం తిరస్కరించిన వారి జీవితాలపై సినిమా.. టైటిల్ ఇదే

‘స్పిరిట్’కు దీపికను వద్దనుకోవడానికి అసలు కారణమిదే: సందీప్ సోదరుడు

చిరు, యశ్‌లతో భారీ ప్రాజెక్టులు మిస్.. అసలు నిజం బయటపెట్టిన దర్శకుడు

Updated Date - Aug 21 , 2026 | 10:29 AM