‘స్పిరిట్’కు దీపికను వద్దనుకోవడానికి అసలు కారణమిదే: సందీప్ సోదరుడు

ABN , Publish Date - Aug 21 , 2026 | 09:29 AM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీ నుంచి దీపికను తీసేయడానికి గల అసలు కారణం నిర్మాత రివీల్ చేశారు.

Spirit Movie Deepika Padukone Exit Reason

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించనుందంటూ గతంలో ప్రచారం సాగడం, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమా విషయంలో దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాస్టింగ్ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) వంగా తాజాగా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు. దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు వర్కవుట్ కాలేదో స్పష్టంగా వివరించారు.


ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పదుకొణెతో ‘స్పిరిట్’ కథ, ఆమె పాత్రకు సంబంధించి చర్చలు జరిపారు. ఆమెకు కథ విపరీతంగా నచ్చినప్పటికీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేకపోయాం. భారీ రెమ్యూనరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా కావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా మేకింగ్‌కు అనుకూలంగా అనిపించలేదు’’ అని తెలిపారు.


భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణానికి ఈ రకమైన షరతులు సమంజసంగా అనిపించకపోవడంతోనే పరస్పర అంగీకారంతో ఆమె స్థానంలో వేరే నాయికను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నామని ప్రణయ్ స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో దీపికా తప్పుకోవడంపై జరుగుతున్న రకరకాల ఊహాగానాలకు, రూమర్లకు ఒక్కసారిగా తెరపడింది. ఇక దీపికా పదుకొణె స్థానంలో వంగా ఆస్థాన నటి తృప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఫైనల్ చేయడం, సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటం తెలిసిందే. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రాన్ని 5 మార్చి 2027న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

చిరు, యశ్‌లతో భారీ ప్రాజెక్టులు మిస్.. అసలు నిజం బయటపెట్టిన దర్శకుడు

‘ఇట్లు అర్జున’.. థియేటర్లలోకి వచ్చే డేట్ ఫిక్స్!

పీవీఆర్ సినిమాస్ చేతికి ‘ధర్మస్థల నియోజకవర్గం’.. రిలీజ్ డేట్ ఫిక్స్

Updated Date - Aug 21 , 2026 | 09:29 AM