సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Yash: యశ్ హీరోగా.. నిర్మాతగా.. ఇప్పుడు ఇంకోలా..

ABN, Publish Date - Aug 08 , 2026 | 10:44 AM

కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ (Yash) మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న ఆయన ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

Yash- Toxic

కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ (Yash) మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న ఆయన ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. యశ్‌కు చెందిన మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌, కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘టాక్సిక్‌’ (toxic) చిత్రాన్ని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. దీంతో మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ కర్ణాటక డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి తొలి అడుగు వేసినట్లైంది.

యశ్‌ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.  టాక్సిక్‌’ సినిమాను  ఇప్పటివరకు లేని విధంగా అత్యంత భారీ థియేట్రికల్‌ రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో థియేటర్లు, భారీ సంఖ్యలో డే-1 షోలను ఏర్పాటు చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. యశ్‌కు కర్ణాటకలో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

 ‘టాక్సిక్‌’ను కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో షూట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యశ్‌ ‘కేజీఎఫ్‌’ తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో మరింత భారీ మార్కెట్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ‘టాక్సిక్‌’పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  

ALSO READ:
Salman khan: దర్శక ద్వయంతో సల్మాన్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్  
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’.. క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అయినట్టేనా? 

Niharika Konidela: బంగారు బోనమెత్తిన నిహారిక.. కోరిక తీరిందంటూ..


Updated Date - Aug 08 , 2026 | 10:54 AM