Salman khan: దర్శక ద్వయంతో సల్మాన్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:22 AM
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దర్శక ద్వయంగా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకేతో (Raj and Dk సల్మాన్ ఖాన్ చేతులు కలిపారు. ఈ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా ఎంటర్‌టైనర్ తెరకెక్కనుంది. ఇప్పటికే విభిన్న కథాంశాలతో వరుస విజయాలను అందుకుంటున్న రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం ఓ సరికొత్త కథను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రైటింగ్ స్టేజ్‌లో ఉందని, స్క్రీన్‌ప్లే పనులు పూర్తయిన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న మైత్రీ మూవీ మేకర్స్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న భారీ క్రేజ్, రాజ్ అండ్ డీకేకు ఉన్న ప్రత్యేక ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రాజ్ అండ్ డీకే మార్క్‌లో ఉండే విభిన్న కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా 2026 చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కథ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం సల్మాన్ 'మాతృభూమి; దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నారు.
ALSO READ:
Yash: యశ్ హీరోగా.. నిర్మాతగా.. ఇప్పుడు ఇంకోలా..
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’.. క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అయినట్టేనా?
Niharika Konidela: బంగారు బోనమెత్తిన నిహారిక.. కోరిక తీరిందంటూ..