సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishwak Sen: పవీష్‌ వారి జాబితాలోకి చేరాలి..

ABN, Publish Date - Jul 07 , 2026 | 04:18 PM

పవీష్‌ నారాయణ్‌, నాగదుర్గ జంటగా మగేశ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌ ఓ లవ్‌’. రొమాన్స్‌, కామెడీ, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది.

Love oh love

పవీష్‌ నారాయణ్‌, నాగదుర్గ జంటగా మగేశ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌ ఓ లవ్‌’. రొమాన్స్‌, కామెడీ, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ‘పవిష్‌ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సినిమా ట్రైలర్‌ చూశాక ఇది భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే యూనివర్సల్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలా అనిపిస్తోంది. కథ, కంటెంట్‌ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. సూర్య, కార్తీ, ధనుష్‌, ప్రదీప్‌ రంగనాథన్‌ చిత్రాలు అందుకు ఉదాహరణ. అదే విధంగా పవిష్‌ కూడా ఆ జాబితాలో చేరాలని కోరుకుంటున్నాను. ‘లవ్‌ ఓ లవ్‌’ సినిమా తెలుగు ప్రేక్షకుల ప్రేమను సొంతం చేసుకోవాలి’ అని అన్నారు.

పవిష్‌ నారాయణన్‌ మాట్లాడుతూ ‘ఏ వేదిక మీదైనా ధనుష్‌ గారికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కూడా. ఆర్టిస్ట్‌కి మొదటి సినిమా ఎంత ముఖ్యమో, రెండో సినిమా కూడా అంతే! నా తొలి సినిమాలో ఏమి చూసి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశారో నాకు తెలియదు కానీ, ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఈ సినిమా ద్వారా నటుడిగా ఎంతో నేర్చుకున్నాను. మొదట ఈ సినిమాలో నా సరసన కొత్త హీరోయిన్‌ నటిస్తుందన్నారు. కానీ నాగ దుర్గ గారి గురించి తెలుసుకున్న తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఎంతటి గుర్తింపు ఉందో చూసి ఆశ్చర్యపోయాను. సినిమాలోనే కాదు.. మీడియా ఇంటర్వ్యూల్లోనూ నాగదుర్గే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది’ అని అన్నారు.

హీరోయిన్‌ నాగ దుర్గా మాట్లాడుతూ ‘ఈ సినిమా అవకాశం నాకు ఎంతో ప్రత్యేకం. ఒక తెలుగు అమ్మాయిగా తమిళ చిత్రంతో పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటిగా నన్ను ఎంపిక చేసిన దర్శకుడు మాగేశ్‌ రాజేంద్రన్‌కి కృతజ్ఞతలు’ అన్నారు.

నిర్మాత దినేష్‌ రాజ్‌ మాట్లాడుతూ ‘ధనంజేయన్‌ గారితో కలిసి చేస్తున్న తొలి చిత్రమిది. ఈ భాగస్వామ్యంలో ఆరు చిత్రాలు నిర్మించబోతున్నాం. మాగేశ్‌ ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. సినిమాపై అద్భుతమైన అవగాహన, స్పష్టమైన విజన్‌ ఉంది. యువతకు దగ్గరయ్యేలా, వారితో అనుబంధాలతో కథను రూపొందించారు. మంచి సందేశాన్ని అందించే చిత్రమిది’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:
RGV: ‘సత్లుజ్‌’ను చూడాలి.. చూపించాలి.. చర్చించాలి
పాలిటిక్స్‌లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా?

అక్కినేని వారబ్బాయికి.. నందమూరి వారసుని 'మాట సాయం'!

Updated Date - Jul 07 , 2026 | 04:23 PM