సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అప్పుడేం చేశారు.. సీఎం విజయ్‌ని ప్రశ్నించిన విశాల్‌పై ఫ్యాన్స్ ఫైర్!

ABN, Publish Date - May 18 , 2026 | 11:06 AM

తమిళ చిత్ర పరిశ్రమ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో సీఎం విజయ్.. ఎలాంటి అనుభవం లేని మంత్రి రాజ్‌మోహన్‌కు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను అప్పగించడాన్ని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ ప్రశ్నించారు.

CM Vijay and Vishal

తమిళ చిత్ర పరిశ్రమ (Kollywood) ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో ఎలాంటి అనుభవం లేని మంత్రి రాజ్‌మోహన్‌కు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను అప్పగించడాన్ని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ (Hero Vishal) ప్రశ్నించారు. ఈ విషయంపై తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌ (Tamil Nadu CM Vijay)ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు విశాల్‌ను తప్పుబడుతున్నారు. సమస్యలు తెలియడానికి ఇండస్ట్రీలోనే ఉండాల్సిన అవసరం లేదని, ఇండస్ట్రీ వ్యక్తులు వెళ్లి కలిస్తే సరిపోతుందనేలా రియాక్ట్ అవుతున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ అయితే విశాల్‌పై ఫైర్ అవుతున్నారు.


ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్.. ఇప్పుడే సమస్యలు గుర్తొచ్చాయా? ఇంతకు ముందు ఉన్న మినిస్టర్‌ని ఎందుకు అడిగి సమస్యలు సాల్వ్ చేసుకోలేదు? సీఎంగా ఇప్పుడే అడుగు పెట్టిన విజయ్‌ నిర్ణయాన్నే తప్పుబడుతున్నావా? అయినా.. అన్నీ తెలిసిన వాడు వస్తేనే.. ఏం పట్టించుకోడు.. తెలియని వాళ్లే మీరు చెప్పేది వింటారు. కాస్తో కూస్తో పనైనా చేస్తారు. కాబట్టి.. సోషల్ మీడియా వేదిక ఉంది కదా.. అని, ఏది పడితే అది పోస్ట్ చేయకు అంటూ.. ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్న సీఎం సినిమా వాడైతే.. సినిమాటోగ్రఫీ మంత్రి గురించి మాట్లాడతావేంటి? అంటూ చురకలు అంటిస్తున్నారు.


ఇక విశాల్ ట్వీట్ విషయానికి వస్తే.. రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఇందులో రాజ్‌మోహన్‌కు పాఠశాల విద్య, పురావస్తు, తమిళ అధికార భాష, తమిళ సంస్కృతి, సమాచారా, ప్రచార, చలనచిత్ర సాంకేతిక, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. దీనిపై విశాల్ స్పందిస్తూ.. ‘ఎలాంటి అనుభవం లేని రాజ్‌మోహన్‌కు సినిమాటోగ్రఫీ శాఖ అప్పగించడం విచారకరం. నిజానికి చిత్ర పరిశ్రమ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో చిత్ర పరిశ్రమలో పలు సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఈ పరిశ్రమలో భాగమై 30 ఏళ్లుగా ఈ పరిశ్రమలో ఉన్న మా ముఖ్యమంత్రితో పోలిస్తే.. ఈ పరిశ్రమలో ఏం జరుగుతుందో అసలు అనుభవం లేని వ్యక్తికి ఎలా తెలియజేయగలం?’ అని ప్రశ్నించారు. అలాగే సీఎం విజయ్ దృష్టికి విశాల్ మూడు ప్రధాన డిమాండ్లను తీసుకెళ్లారు. ప్రభుత్వం టిక్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, స్థానిక సంస్థల పన్ను రద్దు చేయాలని, చిన్న సినిమాలకు ప్రస్తుతం ఉన్న స్వల్ప వార్షిక సబ్సిడీ పెంచాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి:

కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. ‘పెద్ది’ ట్రైలర్‌పై నాగవంశీ

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Updated Date - May 18 , 2026 | 11:06 AM