Thalapathy Vijay: శుభాకాంక్షల వెల్లువ!

ABN , Publish Date - May 04 , 2026 | 04:05 PM

దళపతి విజయ్‌ ఊహించని విజయాన్ని తమిళ నాట అందుకున్నారు. దాంతో తెలుగు సినీ ప్రముఖులు పలువురు తోటి నటుడు విజయ్‌కు అభినందనలు తెలిపారు.

Thalapathy Vijay

తమిళనాడు రాజకీయాలలో దళపతి విజయ్‌ (Vijay) అనూహ్య విజయాన్ని దక్కించుకోబోతున్నాడు. అభిమానులు తనకిచ్చిన దళపతి అనే బిరుదుకు సార్థకత చేకూర్చుతు... ఇవాళ నిజంగానే దళపతిగా నిలిచాడు. రెండేళ్ళ క్రితం తాను పెట్టిన 'తమిళక వెట్రి కళగం' (TVK) పార్టీని ఒంటి చేతితో గెలిపించి, తన సత్తాను చాటుకున్నాడు. ఒకే ఒక్కటి తప్ప మిగిలిన ఎగ్జిట్‌ పోల్స్ అన్నీ విజయ్‌ ఓడిపోతాడనే చెప్పాయి. అనేక సంస్థలు విజయ్‌ పాతికలోపు స్థానాలే గెలుచుకుంటాడని జోస్యం చెప్పాయి. అయితే వాటిని తిరగరాసి విజయ్‌ సెంచరీని దాటేస్తున్నాడు. మ్యాజిక్‌ మార్క్‌ను అందుకోవడానికి కొన్ని సీట్లు మాత్రమే తగ్గుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నాడని సన్నిహితులు అంటున్నారు.

WhatsApp Image 2026-05-04 at 1.23.18 PM.jpeg


WhatsApp Image 2026-05-04 at 2.14.19 PM.jpeg

ఎన్నికల సమయంలో డీ.ఎం.కే.తో బాహాబాహీకి దిగిన విజయ్‌ అన్నా డీఎంకే పైనా ఆ స్థాయిలో విమర్శలు చేయలేదు. వారి ఆలోచన విధానంతో తనకు సరిపడదని మాత్రం స్పష్టం చేశాడు. ఇప్పుడు తుది ఫలితాలు వచ్చిన తర్వాత సైతం విజయ్‌ అభిప్రాయాలో మార్పు ఉండదని సన్నిహితులు చెబుతున్నారు. తన ఐడియాలజీని సమర్థించే చిన్న పార్టీలతో విజయ్‌ చేతులు కలుపుతాడని, వారి సాయంతో పూర్తి స్థాయిలో మెజారిటీని పొంది, అధికారాన్ని చేపడతాడని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో విజయ్‌ పొత్తు పెట్టుకోడని వార్తలు వస్తున్నాయి.

WhatsApp Image 2026-05-04 at 2.30.53 PM.jpeg


WhatsApp Image 2026-05-04 at 2.48.02 PM.jpeg

ఇదిలా ఉంటే... విజయ్‌ పార్టీ ఊహించని విజయాన్ని అందుకోవడంతో తెలుగు, తమిళ సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు అతన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. తమిళ స్టార్స్ కాస్తంత మౌనం పాటిస్తున్నా... తెలుగువారైన నాని, రవితేజ, శర్వానంద్‌, నిఖిల్‌, సాయి దుర్గాతేజ్‌, రామ్ పోలినేని, సందీప్‌ కిషన్‌, మంచు మనోజ్, డా. రాజశేఖర్ వంటి వారు విజయ్‌ ను ఎక్స్ వేదికగా అభినందించారు.

WhatsApp Image 2026-05-04 at 2.57.14 PM.jpeg

ఇవి కూడా చదవండి:

త్రిష బర్త్‌డే.. విజయంతో విజయ్ ట్రీట్ ఇస్తాడా? లేక!

‘సన్ రైజర్స్‌’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!

‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?

Updated Date - May 04 , 2026 | 04:25 PM