Trisha: విజయ్ పట్టాభిషేకం.. త్రిష మెరుపులు
ABN , Publish Date - May 10 , 2026 | 10:44 AM
తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది మంది అభిమానుల జేజేల మధ్య ‘తమిళగ వెట్రి కళగం’ అధినేత, దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది మంది అభిమానుల జేజేల మధ్య ‘తమిళగ వెట్రి కళగం’ (Tamilaga Vettri Kazhagam) అధినేత, దళపతి విజయ్ (Vijay) తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM Vijay)గా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నై వేదికగా జరిగిన ఈ అట్టహాసమైన వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అయితే, ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం విజయ్ వెండితెర ‘లక్కీ చార్మ్’ త్రిషా కృష్ణన్. కొన్ని రోజులుగా విజయ్ (Vijay), త్రిష (Trisha)లపై ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారనేలా ప్రచారం జరుగుతోంది. విజయ్ ఇప్పటికే తన భార్య సంగీత నుంచి విడిపోయే ప్రాసెస్‌లో ఉన్నారు. అందుకు కారణం విజయ్‌తో త్రిష రిలేషనే అని తమిళనాట ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్ గెలిచిన అనంతరం ఇంటికెళ్లి మరీ త్రిష శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఓ పెళ్లికి కూడా వీరిద్దరూ కలిసి హాజరయ్యారు.
ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్న వేళ త్రిష ఎంతో హుందాగా, సంప్రదాయబద్ధమైన కట్టుబొట్టుతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో విజయ్‌తో కలిసి ‘గిల్లి’, ‘కురువి’, ‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లలో నటించిన ఈ క్రేజీ కాంబినేషన్.. ఇప్పుడు రాజకీయ వేదికపై కూడా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఆనందంలో వారి పెళ్లికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నాయనేలా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఏమో ఏమైనా జరగవచ్చు.
ఎందుకంటే, అసలు 20 సీట్లు కూడా రావని అంతా అంచనాలు వేస్తే, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ.. అతి పెద్దపార్టీగా టీవీకే పార్టీ నిలిచి, అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అన్నింటినీ జయించి, విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించారు. మొత్తంగా చూస్తే.. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ ఈవెంట్‌లో త్రిష సందడి సోషల్ మీడియాలో ‘ట్రెండింగ్’ టాపిక్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!
Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!
జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!
తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్