సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మణిరత్నం సినిమా కోసం విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం

ABN, Publish Date - Oct 09 , 2026 | 12:51 PM

లెజెండరీ దర్శకుడి ప్రాజెక్ట్ కోసం విజయ్ సేతుపతి తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు యావత్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Inji Vellam Update

భారతీయ చిత్ర పరిశ్రమలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి (Makkal Selvan Vijay Sethupathi) ప్రయాణం ఎంత విశిష్టమైనదో సినీ ప్రేమికులందరికీ తెలుసు. పాత్ర చిన్నదా, పెద్దదా.. హీరోనా, విలనా అనే తేడాలు లేకుండా కథ నచ్చితే చాలు.. ప్రాణం పెట్టి నటించే అరుదైన నటుటు సేతుపతి. ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా మారి.. వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. మార్కెట్ పరంగా ఆయనకు ఉన్న క్రేజ్, ఆయన తీసుకునే పారితోషికం కూడా అదే రేంజ్‌లో ఉంటుందనే విషయం తెలియంది కాదు. కానీ, ఓ లెజెండరీ దర్శకుడి ప్రాజెక్ట్ కోసం విజయ్ సేతుపతి తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు యావత్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే..


సాధారణంగా విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకు దాదాపు రూ. 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఆయనకున్న మార్కెట్, టాలెంట్, నటనకు నిర్మాతలు కూడా ఆ మొత్తం ఇచ్చేందుకు వెనుకాడరు. అయితే, భారతీయ సినీ దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇంజి వెల్లం’ (Inji Vellam) కోసం విజయ్ సేతుపతి ఏకంగా సగానికిపైగా రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కోసం ఆయన కేవలం రూ. 6 కోట్లకే నటించబోతున్నట్లుగా కోలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.


విజయ్ సేతుపతి కెరీర్‌లో మణిరత్నం దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘నవాబ్’ (చెక్క చివంత వానమ్) ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. మణిరత్నం మేకింగ్ స్టైల్ అన్నా, ఆయన విజన్ అన్నా సేతుపతికి ఎంతో గౌరవం. సినిమా బడ్జెట్ పరిమితులు, కథ ఏంటి అనేది పక్కన పెడితే.. లెజెండరీ దర్శకుడితో మరోసారి పనిచేయాలనే బలమైన కోరికతోనే విజయ్ సేతుపతి ఇంత భారీ స్థాయిలో తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం సినిమాల్లో రొమాన్స్ చేసే అవకాశం కోసం వేచి చూస్తున్నానంటూ సేతుపతి స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా చూసినా.. సేతుపతి డ్రీమ్ నెరవేరినట్టే. అందుకే, నేటి రోజుల్లో ఒక్క హిట్ పడగానే రెమ్యూనరేషన్లను అమాంతం పెంచేసే స్టార్ల మధ్య.. సినిమా కంటెంట్‌కు, దర్శకుడికి విలువను ఇస్తూ.. విజయ్ సేతుపతి తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమని నెటిజన్లు, సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. సో.. ఈ క్రేజీ కాంబోలో రానున్న ‘ఇంజి వెల్లం’ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

సుమలత పిటిషన్‌తో డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..

Scene Movie: సూర్య, నజ్రియా.. ‘అమ్మో ఇది ఎవర్రా’

కోలీవుడ్‌కు మరో టాలీవుడ్ హీరోయిన్ జంప్

Updated Date - Oct 09 , 2026 | 12:51 PM