సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సూర్య కెరీర్‌లో అరుదైన రికార్డ్‌.. తొలి రోజు వసూళ్లలో ‘సీన్‌’ సరికొత్త సంచలనం!

ABN, Publish Date - Nov 07 , 2026 | 02:30 PM

సూర్య నటించిన ‘సీన్‌’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి రోజే తమిళంలో రూ.16.15 కోట్లు, తెలుగులో రూ.3 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించి.. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్’ చిత్రాల ఓపెనింగ్‌ కలెక్షన్లను అధిగమించింది. మొత్తంగా రూ.19.15 కోట్ల నెట్‌తో సూర్య కెరీర్‌లోనే అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Scene Movie

తమిళ స్టార్ హీరో సూర్య తన కెరీర్‌ లోనే రేర్‌ రికార్డ్ ను కైవసం చేసుకున్నాడు. ఈ యేడాది సూర్య నటించిన 'కరుప్పు' సినిమా మే 15వ తేదీ విడుదలైంది. అది రూ. 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఆ తర్వాత సూర్య నటించిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' ఆగస్ట్ 14న విడుదలైంది. ఈ సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇదే నేపథ్యంలో నవంబర్ 6న దీపావళి కానుకగా వచ్చిన 'సీన్' సైతం పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతోంది. దీపావళికి హిందీ సినిమా 'రామాయణం', నయనతార 'మహాశక్తి' కూడా విడుదలయ్యాయి. అయితే వాటికంటే మిన్నగా 'సీన్' సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. చిత్రం ఏమంటే... సూర్య 'కరుప్పు, విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ను సైతం 'సీన్‌' క్రాస్ చేసి, కొత్త రికార్డును క్రియేట్ చేసింది.


ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన 'కరుప్పు' సినిమా తెలుగులో 'వీరభద్రుడు'గా డబ్ అయ్యింది. ఈ సినిమా తొలి రోజున రూ. 15.50 కోట్ల నెట్‌ను వసూలు చేసింది. అలానే వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' మూవీ రూ. 15.35 కోట్ల నెట్‌ను తొలి రోజున వసూలు చేసింది. అయితే... ఈ రెండు సినిమాలకన్నా మిన్నగా 'సీన్‌' మూవీ తమిళంలో రూ. 16.15 కోట్ల నెట్‌ను, తెలుగులో రూ. 3 కోట్ల నెట్‌ను తొలిరోజున వసూలు చేసింది. అంటే మొత్తంగా 19.15 కోట్ల రూపాయల నెట్ ను ఈ సినిమా వసూలు చేసినట్టు. అయితే ఈ యేడాది తొలి రోజు వసూళ్ళలో రికార్డ్ ను సృష్టించింది మాత్రం రజనీకాంత్‌ 'జైలర్‌ 2' సినిమానే. ఆ సినిమాకు ఇండియాలో రూ. 59.70 కోట్లు రాగా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నటించిన 'జన నాయగన్‌' సినిమా తొలి రోజున రూ. 42.70 కోట్ల నెట్‌ను వసూలు చేసింది.


సూర్య బ్లైండ్‌ పోలీస్‌ ఆఫీసర్ గా నటించిన 'సీన్‌' మూవీని మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌ తెరకెక్కించాడు. గతంలో మలయాళంలో 'రోమాంచం, ఆవేశం' చిత్రాలను రూపొందించిన జీతూ మాధనవ్ కు ఇదే తొలి తమిళ చిత్రం. ఇందులో మలయాళ నటి నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించగా, 'ప్రేమలు' ఫేమ్‌ నస్లెన్‌ విలన్‌గా నటించాడు. మరో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ ప్రత్యేక పాత్రను పోషించగా, లాల్‌ ఇందులో కీలక పాత్రను చేశాడు. తమిళ, మలయాళ నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో సూర్య ఈ సినిమాను సొంత బ్యానర్‌లో నిర్మించాడు. ఇదిలా ఉంటే... 'సీన్‌' సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని దర్శకుడు క్లయిమాక్స్ లో లీడ్‌ ఇచ్చాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న పెర్ఫ్యూమ్‌ కిల్లర్ తప్పించు పోవడంతో అతన్ని పట్టుకునే పని సూర్యకు డిపార్ట్మెంట్ అప్పగిస్తుంది. దీనిని బట్టి 'సీన్‌ 2'లో టోవినో థామస్‌ ప్రథాన విలన్‌గా నటిస్తున్నాడని అనుకోవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

వెంకీ విక్టరీకి అనిల్ రావిపూడినే దిక్కా..?

ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే

నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్

Updated Date - Nov 07 , 2026 | 02:39 PM