సూర్య ‘కరుప్పు’ రిలీజ్ ప్రాబ్లమ్స్ వెనుక ఇంత కథ ఉందా?
ABN , Publish Date - Jun 15 , 2026 | 08:45 PM
‘కరుప్పు’ సక్సెస్ సూర్యకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో తెలియంది కాదు. అయితే, ఈ సినిమా అనుకున్న టైమ్‌కి రిలీజ్ కాకపోవడానికి, అన్నీ సెట్ చేసుకుని రేపు రిలీజ్ అనగా ఆలస్యంగా విడుదలవడానికి పెద్ద కథే నడిచినట్లుగా తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), ఆర్జే బాలాజీ (RJ Balaji) కాంబినేషన్‌లో వచ్చిన ‘కరుప్పు’ (Karuppu) సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుని రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ను బీట్ చేసింది. ఈ సినిమాకు ముందు సూర్య వరుస పరాజయాల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ‘కరుప్పు’ సక్సెస్‌ని సూర్య గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాకు మెయిన్ సాంకేతిక నిపుణులైన వారందరికీ సూర్య కారు గిఫ్ట్‌గా ఇచ్చారంటే.. ఈ సక్సెస్ సూర్యకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా అనుకున్న టైమ్‌కి రిలీజ్ కాకపోవడానికి, అన్నీ సెట్ చేసుకుని రేపు రిలీజ్ అనగా ఆలస్యంగా విడుదలవడానికి కారణం ఏంటో అందరికీ తెలుసు.
కానీ, అన్ని రిలీజ్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిన తర్వాత.. సినిమా థియేటర్లలోకి రావడానికి కూడా చాలా మంది సహకారం ఉందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వెల్లడించడంతో.. ‘కరుప్పు’ విడుదల వెనుక ఇంత ఫైనాన్షియల్ వార్ జరిగిందా? అని అంతా ఆశ్చర్యపోతారు. రిలీజ్ రోజు కూడా ఈ సినిమా చాలా ఆలస్యంగా విడుదలైంది. అప్పటికప్పుడు కొందరు ఫైనాన్షియర్స్ సపోర్ట్ చేయడం వల్లే.. ఈ సినిమా సాఫీగా విడుదలైందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ సినిమా విడుదలకు సహకరించిన వారందరి గురించి ఆయన చెప్పుకొచ్చారు.
సినిమా ఆగిపోతుందని తెలిసి.. అందరికంటే ముందు సూర్య రియాక్ట్ అయ్యారని.. కానీ అక్కడున్న ఇబ్బందులు తను చేయగలిగిన దానికంటే ఎక్కువ ఉండటంతో.. ఆయన చేయగలిగింది చేశారని తెలిపారు. నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు, ఇతర యూనిట్ అంతా సినిమా విడుదల ఆగిపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ఆ సమయంలో అరుళ్‌భాతి ఎంతగానో సహాయం చేశారని గుర్తు చేశారు. ఆయనకు ఈ సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా, సినిమా విడుదల కోసం ఫైనాన్షియర్స్‌తో చర్చలు జరిపిన విధానం మాత్రం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఆయన చెప్పడం వల్లే.. తను, ఆర్‌బి చౌదరి వెనక్కి తగ్గామని అన్నారు. అరుళ్ భాతి విజ్ఞప్తితో తామంతా 70 శాతం వరకు తగ్గించుకుని, తర్వాత సినిమాల్లో సర్దుబాటు చేసుకుంటామని తెలిపినట్లుగా ఆయన వెల్లడించారు.
అన్నీ సర్దుకున్నాక కూడా ఈ సినిమాకు రూ. 5 కోట్లు అవసరమైందని, అప్పుడు సూర్య తరపున రాజశేఖర్ పాండియన్, దర్శకుడు హెచ్. వినోద్ వంటి వారు అమౌంట్ సర్దుబాటు చేశారని తిరుప్పూర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ మొత్తం వార్‌లో దర్శకుడు ఆర్జే బాలాజీ మాత్రం ఎక్కడా ఇన్‌వాల్వ్ అవ్వలేదని, కేవలం ఒక్క వీడియో మాత్రమే ఆయన విడుదల చేశారని వెల్లడించారు. అసలీ చిత్రం ఇంతగా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేయడానికి కారణం ఓటీటీ రైట్సేనని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతలు రూ. 80 కోట్ల వరకు వస్తాయని అంచనా వేయగా, రూ. 30 కోట్లకే ఒప్పందం కుదరడంతో.. ఈ ఇబ్బందులన్నీ వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ఫైనాన్షియర్స్ అందరూ పెద్ద మనసుతో వెనక్కి తగ్గబట్టే సినిమా విడుదలైందని, లేదంటే.. పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన అన్నారు. తెరవెనుక సినిమాను నిలబెట్టిన వీళ్లందరినీ యూనిట్ గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని తిరుప్పూర్ సుబ్రమణ్యం.. అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఇవి కూడా చదవండి:
మెగా రికార్డ్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
సాయి పల్లవి అనుకున్నప్పుడు ఆ సీన్స్ లేవు: ‘మా ఇంటి బంగారం’ టీమ్‌తో చిట్ చాట్
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్