Suriya: టాలీవుడ్ బాక్సాఫీస్‌పై సూర్య హవా.. ఒకే ఏడాదిలో అరుదైన హ్యాట్రిక్!
ABN, Publish Date - Nov 20 , 2026 | 02:28 PM
తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలకు ఇక్కడ లభిస్తున్న ఆదరణ మరోసారి బాక్సాఫీస్ వద్ద స్పష్టమైంది.
తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలకు ఇక్కడ లభిస్తున్న ఆదరణ మరోసారి బాక్సాఫీస్ వద్ద స్పష్టమైంది. 2026లో వరుస విజయాలతో సూర్య సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒకే క్యాలెండర్ ఇయర్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన మూడు చిత్రాలను అందించిన తొలి నాన్-తెలుగు హీరోగా నిలిచారు. తాజాగా ఆయన నటించిన ‘సీన్’ సినిమా ఈ ఘనతకు మరో కారణమైంది. విడుదలైన 13 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.34.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో నైజాం వాటా రూ.19.51 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.14.79 కోట్ల గ్రాస్ నమోదైంది. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉన్నప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. పరిమిత సంఖ్యలో థియేటర్లు, షోలు అందుబాటులో ఉన్నా ప్రేక్షకుల ఆదరణతో సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది.
ఈ ఏడాది సూర్యకు బాక్సాఫీస్ వద్ద ఇది మూడో విజయం. సంవత్సరం ప్రారంభంలో విడుదలైన ‘కరుప్పు’ తెలుగు రాష్ట్రాల్లో రూ.38.02 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూ.63.96 కోట్లతో సూర్య కెరీర్లోనే భారీ వసూళ్లను అందుకుంది. తాజాగా ‘సీన్’ రూ.34.30 కోట్ల గ్రాస్ సాధించడంతో ఈ మూడు సినిమాల మొత్తం వసూళ్లు రూ.136.28 కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఒకే ఏడాదిలో మూడు రూ.30 కోట్ల గ్రాసర్లను అందుకోవడం సూర్య తెలుగు మార్కెట్ స్థాయిని తెలియజేస్తోంది. ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు కూడా తెలుగు రాష్ట్రాల్లో తమ మార్కెట్‌ను విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో సూర్య ఈ ఘనత సాధించడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ వంటి అగ్ర హీరోలకు సైతం ఇప్పటివరకు సాధ్యం కాని రికార్డును సూర్య అందుకున్నారనే చర్చ అభిమానుల్లో మొదలైంది.
Samantha: తల్లిదండ్రులైన సమంత-రాజ్ నిడిమోరు.. బాబుకి పేరు కూడా పెట్టేశారు..
‘వృషకర్మ’ నుంచి ‘ఛలో పదవే’ సాంగ్.. మెలోడీ అదిరింది
Sai Pallavi: తాతయ్య ఇచ్చిన కానుక.. ఇప్పటికీ వదలని సాయి పల్లవి
శర్వా ‘భోగి’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?