సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా
ABN, Publish Date - Nov 10 , 2026 | 10:03 AM
‘కరుప్పు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ తర్వాత తాజా బ్లాక్‌బస్టర్ ‘సీన్’ (Scene)తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.
‘కరుప్పు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ తర్వాత తాజా బ్లాక్‌బస్టర్ ‘సీన్’ (Scene)తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya). జిత్తు మాధవన్ దర్శకత్వంలో ఇన్బరాజ్ పాండియన్ అనే పాత్రలో సూర్య కనబరిచిన నటన, డార్క్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ‘సీన్’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ జోష్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్న తరుణంలోనే, సూర్య తదుపరి చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. సూర్య కెరీర్లో క్రేజీ మూవీగా నిలవనున్న 49వ ప్రాజెక్ట్ (#Suriya49) కు సంబంధించిన తాజా సమాచారం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘మండాడి’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న దర్శకుడు మదిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendhi) దర్శకత్వంలో సూర్య తన 49వ చిత్రాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల జీవన విధానం, వారి కష్టసుఖాలు, పోరాటాల నేపథ్యంలో సాగే భారీ కోస్టల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి దివంగత లెజెండరీ నటుడు ఎంజీఆర్ నటించిన క్లాసిక్ టైటిల్ ‘పడగోట్టి’ (Padagotti) అనే పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం వింటుంటే.. సూర్య ఖాతాలో మరో హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు. ప్రముఖ అగ్ర నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ అనే ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ అది ఆలస్యమవుతూ వస్తోంది. అయితే నిర్మాత థాను ఆ ప్రాజెక్ట్ తప్పకుండా ఉంటుందని ఇటీవల సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో ముందుగా వీరి కాంబోలో ఈ తీరప్రాంత కథ పట్టాలెక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది.
ఇక సూర్య రాబోయే చిత్రాల లైనప్ పరిశీలిస్తే.. ‘పడగోట్టి’ కంటే ముందుగా సూర్య 48వ చిత్రంగా (#Suriya48) ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2027 మే 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిత్తు మాధవన్‌తో చేసిన తాజా చిత్రం ‘సీన్’తో భారీ విజయాన్ని అందుకున్న సూర్య.. వరుసగా దర్శకుడు టి.జె. జ్ఞానవేల్, ఆపై మదిమారన్ పుగళేంది వంటి విలక్షణమైన మేకర్స్‌తో చిత్రాలను లైనప్ చేస్తూ తన విజయ పరంపరను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పక్కా ప్లాన్‌తో అడుగులేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ
సినీ తారల ఇళ్లలో దీపావళి సందడి.. వర్షంలోనూ ఫ్యాన్స్ తగ్గేదేలే
చిరు లీక్స్లా లీక్స్ ఇవ్వను.. ‘కాకా’ సంక్రాంతికే: రామ్ చరణ్