శంకర్ తనయుడు హీరోగా.. సినిమా టైటిల్ ఇదే!
ABN, Publish Date - Jun 20 , 2026 | 12:08 PM
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కుమారుడు హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయన కుమార్తె అదితి శంకర్ ఇప్పటికే నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడాయన కుమారుడు హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ప్రముఖ దర్శకుడు ఎస్.శంకర్ (Kollywood Director Shankar) తనయుడు అర్జిత్ శంకర్ (Arjith Shankar) హీరోగా ‘లవర్ బాయ్’ (Lover Boy) పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు అట్లీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అశోక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతిశెట్టి హీరోయిన్. సుధన్ సుందరం, వెంకట్ కె.నారాయణ నిర్మాతలుగా ఫ్యాషన్ స్టూడియోస్, కేవీఎన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు కొత్త, ఉత్తేజకరమైన కథాంశాలను, ప్రతిభావంతులైన నటీనటులను విజయవంతంగా పరిచయం చేస్తూ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘లవర్ బాయ్’ ప్రారంభ పూజా కార్యక్రమం చెన్నై నగరంలో గ్రాండ్‌గా జరిపారు.
ఈ కార్యక్రమానికి దర్శకులు శంకర్, ఏఆర్ మురుగదాస్, హెచ్.వినోద్, మదన్.. నిర్మాతలు లలిత్ కుమార్, ఫైవ్‌స్టార్ సెంథిల్, జీ స్టూడియోస్ అక్షయ్.. డిస్ట్రిబ్యూటర్లు అళగర్, శీను, థింక్ మ్యూజిక్ సంతోష్, హాట్‌స్టార్ ప్రసన్న తదితరులు హాజరై, చిత్ర బృందాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సుధన్ సుందరం మాట్లాడుతూ, ‘‘ఫ్యాషన్ స్టూడియోస్‌లో నేటి తరం ప్రతిభావంతులను, కొత్త కథలను ప్రోత్సహిస్తున్నాం. ‘లవర్‌బాయ్’ కథ మొదటిసారి విన్నపుడే దర్శకుడు అశోక్‌పై మంచి నమ్మకం ఏర్పడింది. ఈ కథ ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు.
భారతీయ సినిమా రంగంలో విజువల్ వండర్స్ సృష్టించిన అగ్ర దర్శకుడు శంకర్ వారసుడిగా అర్జిత్ శంకర్ వెండితెరకు పరిచయం అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తండ్రి ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా, తనదైన నటనతో మెప్పించేందుకు అర్జిత్ శంకర్ ఈ ‘లవర్ బాయ్’ చిత్రం కోసం ప్రత్యేకంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, కేవలం నటనపై ఉన్న ఆసక్తితో, వైవిధ్యమైన లవ్ స్టోరీని ఎంచుకుని హీరోగా మొదటి అడుగు వేస్తుండటం విశేషం. స్టార్ డైరెక్టర్ శంకర్ క్రేజ్, అర్జిత్ లుక్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శంకర్ కుమార్తె అదితి శంకర్ ఇప్పటికే నటిగా తన మార్క్‌ని క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
మాట నిలబెట్టుకున్న థమన్.. ఎంత గొప్ప మనసో!
రుక్మిణి వసంత్ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!
హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు
Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ