‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్ శ్రీ కార్తిక్‌తో రుక్మిణి వసంత్ భారీ ప్రాజెక్ట్
ABN, Publish Date - Oct 23 , 2026 | 04:57 PM
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు హృదయాలను హత్తుకునే మదర్ సెంటిమెంట్‌ను జోడించి ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) చిత్రంతో విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీ కార్తిక్ తన సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు హృదయాలను హత్తుకునే మదర్ సెంటిమెంట్‌ను జోడించి ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) చిత్రంతో విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీ కార్తిక్ (Shree Karthick) తన సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో దక్షిణాదిన సెన్సేషన్‌గా మారి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న టాలెంటెడ్ నటి రుక్మిణి వసంత్ ఇందులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా కాస్టింగ్‌కు సంబంధించి విడుదల చేసిన ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియో ఆద్యంతం సరదాగా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఇందులో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ను ‘తారా’ అనే కీలక పాత్రలో పరిచయం చేయడంతో పాటు దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జాతీయ అవార్డు గెలుచుకున్న ‘చి ల సౌ’ చిత్రాన్ని అందించిన సిరుని సినీ కార్పొరేషన్ (జస్వంత్ నడిపల్లి), ఒరిజినల్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మ్యాడ్‌బాయ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘కీడా కోలా’, ‘కాంత’ వంటి విభిన్న చిత్రాలతో అనుబంధం ఉన్న సాయికృష్ణ గద్వాల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఈ కథను సిద్ధం చేయడానికి చిత్ర బృందం పడిన కష్టాన్ని ప్రతిబింబించేలా సోషల్ మీడియాలో ప్రత్యేక డాక్యు-డ్రామా రీల్ సిరీస్‌ను రూపొందించగా.. అందులో భాగంగానే తాజాగా విడుదలైన ‘తారా’ (Thara) అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
హై-కాన్సెప్ట్ కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన శ్రీ కార్తిక్ విజన్, నేచురల్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించే రుక్మిణి వసంత్ క్రేజ్ తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ మంచి బజ్ ఏర్పడింది. కథా ప్రపంచం, వినోదభరితమైన మూడ్‌ను పరిచయం చేస్తూ విడుదలైన తాజా గ్లింప్స్ సినీ ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రుక్మిణి వసంత్‌కు కూడా చాలా కీలకమనే విషయం తెలియంది కాదు.
ఇవి కూడా చదవండి:
యన్టీఆర్-త్రివిక్రమ్ పౌరాణిక చిత్రంపై క్రేజీ అప్డేట్
ప్రభాస్ కోసం ‘మిరాయ్’ డైరెక్టర్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్
Prabhas: టాలీవుడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే