మెగా ఇంట పెళ్లి సందడి.. సుప్రీం హీరో పెళ్లి ఫిక్స్
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:38 PM
మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలుకానుంది. కొంతకాలంగా సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej)
మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలుకానుంది. కొంతకాలంగా సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej), తన జీవితంలోకి సరికొత్త భాగస్వామిని ఆహ్వానించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు ప్రభాస్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే తేజ్ పేరునే వినిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా మెగా మేనల్లుడికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఎట్టకేలకు ఆ శుభవార్త త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. నవంబరు నెలలో ఈ వివాహ వేడుక అత్యంత ఘనంగా జరగనుందని సమాచారం.
వచ్చేవారంలో లేదా త్వరలోనే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ పెళ్లికి సంబంధించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సాయి దుర్గా తేజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు, ఆయన చిన్ననాటి స్నేహితురాలే అని వినికిడి. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉండగా, పెద్దల అంగీకారంతో ఈ బంధం పెళ్లిపీటల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. నవంబర్ 5 న వీరి నిశ్చితార్ధం జరగనుందని టాక్. ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనే వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మెగా కుటుంబం నుంచి ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు, తేదీలు అధికారికంగా వెల్లడవుతాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తేజ్ కెరీర్ విషయానికొస్తే విరూపాక్ష సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొన్నమెగా హీరో ప్రస్తుతం సంబరాల ఏటిగట్టుముందుకు రానున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.