అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖుల క్యూ
ABN, Publish Date - Nov 09 , 2026 | 02:03 PM
Rajinikanth to Attend Anirudh-Kavya Maran Wedding Chennai Airport Videos Go Viral
సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఆయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్‌తో ఆయన వివాహం జరగనుంది. నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్ వేదికగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకలు జరగనుంది. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గ్రీస్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గ్రీస్‌కు బయలుదేరారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్‌తో కలిసి చెన్నై విమానాశ్రయానికి చేరుకుని గ్రీస్‌కు బయల్దేరిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ షర్ట్, క్యాజువల్ లుక్‌లో కనిపించిన రజినీకాంత్‌ను ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
మరోవైపు కావ్య మారన్ కుటుంబానికి తమిళనాడు రాజకీయ, వ్యాపార వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుటుంబంలో జరుగుతున్న ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. డీఎంకే నేత, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్రీస్‌కు ప్రయాణమయ్యారు. వీరే కాకుండా చాలా మంది సినీ, రాజకీయ రంగాల నుంచి ప్రముఖుల ఈ వివాహానికి హాజరుకానున్నారు. వివాహానంతరం నవంబర్ 13న అనిరుధ్, కావ్య మారన్ చెన్నైకి తిరిగి రానున్నారని తెలిసింది. నవంబర్ 21న చెన్నైలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల కోసం భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.
ALSO READ:
‘రామాయణం’పై వర్మ ప్రశంసల వర్షం.. విమర్శకులకు తనదైన స్టైల్లో కౌంటర్!
Daler Mehndi: ఉత్తరాఖండ్ వివాదం.. దలేర్ మెహందీ భావోద్వేగ పోస్ట్!
Chandini Chowdary: చాందిని చౌదరి.. బాబీ సింహ.. ఓ డార్క్ కామెడీ