నా భర్త నా కోరిక తీర్చేశారు: నటి పూర్ణ భావోద్వేగం
ABN, Publish Date - Aug 26 , 2026 | 02:33 PM
చిత్ర పరిశ్రమలో తనదైన నటన, అద్భుతమైన నృత్య ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ.. ఇటీవల విడుదలైన ‘జైలర్-2’ మొదటి పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
చిత్ర పరిశ్రమలో తనదైన నటన, అద్భుతమైన నృత్య ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ (Poorna).. ఇటీవల విడుదలైన ‘జైలర్-2’ (Jailer 2) మొదటి పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి విడుదలైన ప్రత్యేక గీతంలో పూర్ణ అదిరిపోయే స్టెప్పులతో మెప్పించారు. ఈ పాటకు వస్తున్న విశేష స్పందనపై ఆమె స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో భావోద్వేగపూరితంగా రియాక్ట్ అయ్యారు.
చిన్నప్పటి నుంచి డ్యాన్స్ టీచర్ కావాలన్నదే తన జీవిత లక్ష్యమని, ఆ కోరికను తన భర్త నిజం చేశారని పూర్ణ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి నాట్యమే సర్వస్వం. నా కల నెరవేరినందుకు నన్ను నేను ఎంతో అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. నా భర్త నా ఆశయాన్ని నమ్మి, దానికి నిండుగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించారు. ఎప్పటికైనా ఒక గొప్ప సూపర్ హీరోతో కలిసి నృత్యం చేయాలని కలలు కనేదాన్ని. కానీ సాక్షాత్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో డ్యాన్స్ చేసే ఇంతటి అద్భుత అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు’’ అని పూర్ణ పేర్కొన్నారు.
ఈ అవకాశం కల్పించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌కు పూర్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నృత్యాన్ని ఆదరించి ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పారు. ‘‘అన్నింటికంటే ముఖ్యంగా నా ఈ ప్రయాణానికి మా అమ్మ చేసిన త్యాగం, కృషితో పాటు మొదటి నుంచి ఆమె నాకు ఇచ్చిన మద్దతే కారణం. నేను ఈ స్థాయిలో ఉండటానికి మా అమ్మే ముఖ్య కారణం. ఈ మధుర క్షణం నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అని పూర్ణ ఎంతో ఉద్వేగంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి:
గొప్ప మనసు చాటుకున్న వినోద్ కుమార్.. ఏం చేశారంటే
‘ఇరుముడి’పై రామ్ చరణ్ ట్వీట్.. వాట్టే టైమింగ్
2.5 కోట్లతో భారతీరాజా స్మారక మండపం.. సీఎం విజయ్‌పై ప్రశంసలు