సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సూర్య మూవీలో నిన్న మమితా బైజు... నేడు నస్లేన్‌!

ABN, Publish Date - Sep 17 , 2026 | 03:13 PM

'ప్రేమలు' హీరోయిన్ మమిత ఇప్పటికే సూర్య సరసన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్'లో హీరోయిన్ గా నటించగా, ఆ సినిమా హీరో నస్లేన్‌... సూర్య తాజా చిత్రం 'సీన్‌'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Premalu Hero Heroine with Suriya

రెండేళ్ళ క్రితం వచ్చిన చిన్న సినిమా 'ప్రేమలు'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరోహీరోయిన్లు నస్లేన్‌ కె గఫూర్‌, మమితా బైజు. 2017లో మమితా బైజు మల్లూవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తే... 2019లో నస్లేన్ అడుగుపెట్టాడు. ఇద్దరికీ నటనలో అనుభవం ఉన్నా... ఓవర్ నైట్‌ స్టార్ డమ్ వచ్చింది మాత్రం 'ప్రేమలు' సినిమాతోనే! 2024లో 'ప్రేమలు' విడుదలైన సంవత్సరమే తమిళంలోకి మమితా బైజు 'రెబల్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. చిత్రంగా అప్పటి నుంచి మమితా బైజు వరుసగా తమిళ చిత్రాలే చేసింది. గత యేడాది ఆమె నటించిన 'డ్యూడ్‌' మంచి విజయం సాధించగా, ఈ యేడాది ధనుష్‌ 'కార'తో పాటు విజయ్‌ 'జన నాయగన్‌' సినిమాలోనూ మమిత నటించింది.


మమితా బైజు తొలిసారి సూర్య సరసన నటించిన 'విశ్వనాథ్‌ అండ్ సన్స్' కూడా ఇదే యేడాది ఆగస్ట్ 14న జనం ముందుకు వచ్చింది. విశేషం ఏమంటే... 'ప్రేమలు' నాయిక మమితా సూర్యతో 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్'లో నటించగా, అదే సినిమా హీరో నస్లేన్‌ ఇప్పుడు సూర్య నెక్ట్స్ మూవీ 'సీన్‌'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల కాబోతోంది. ఇలా సూర్యతో ఒకే సినిమా హీరోహీరోయిన్లు బ్యాక్ టు బ్యాక్‌ నటించడం కాకతాళీయం.

'డ్యూడ్‌' తర్వాత మమిత నటించిన తమిళ చిత్రాలు 'కార, జన నాయకన్' హిట్‌ కాలేదు. కానీ 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్'తో ఆమె తిరిగి సక్సెస్ అందుకుంది. ఇక నస్లేన్‌ కు ఇదే మొదటి తమిళ చిత్రం. సో... మమితకు హిట్‌ ఇచ్చినట్టే సూర్య... నస్లేన్ కూ విజయాన్ని అందిస్తాడేమో చూడాలి. ఈ యేడాది ఇప్పటికే వచ్చిన సూర్య చిత్రాలు 'కరప్పు, విశ్వనాథ్‌ అండ్ సన్స్' మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోతున్న 'సీన్‌' కూడా హిట్‌ అయితే సూర్య ఏకంగా ఒకే యేడాది హ్యాట్రిక్‌ కొట్టినట్టు అవుతుంది. ఇది సూర్య కెరీర్‌లోనే రేర్ రికార్డ్‌!

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్‌పై అనుమానాలు.. అసలు విషయం ఏంటంటే

సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం

కేంద్ర సెన్సార్ బోర్డులో కీలక మార్పు.. సుప్రియ యార్లగడ్డకు చోటు

Updated Date - Sep 17 , 2026 | 03:16 PM