సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Keerthy Suresh: ఇంట్లో అడ్డంగా దొరికిపోయా.. అతనితో లేచిపోవాలనుకున్నా

ABN, Publish Date - Nov 06 , 2026 | 11:35 AM

సాధారణంగా ప్రేమ పెళ్లిళ్లను చాలామంది ఇళ్ళల్లో ఒప్పుకోరు. ముఖ్యంగా అమ్మాయి ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. దీనికి సెలబ్రిటీలు కూడా అతీతులేమి కారు. తాజాగా అందాల భామ కీర్తి సురేష్( Keerthy Suresh) కూడా తన పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను

Keerthy Suresh

సాధారణంగా ప్రేమ పెళ్లిళ్లను చాలామంది ఇళ్ళల్లో ఒప్పుకోరు. ముఖ్యంగా అమ్మాయి ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. దీనికి సెలబ్రిటీలు కూడా అతీతులేమి కారు. తాజాగా అందాల భామ కీర్తి సురేష్( Keerthy Suresh) కూడా తన పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను అని, ఒకానొక దశలో ప్రేమించినవాడితో లేచిపోదామని అనుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కీర్తి.. అక్క సిరీస్ లో నటించిన విషయం తెల్సిందే. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న కీర్తి తాజాగా తన ప్రేమ, పెళ్లి సీక్రెట్స్ ని బయటపెట్టింది.


తన భర్త ఆంటోని తటిల్ తో ప్రేమలో పడ్డప్పటి నుంచి పెళ్లి వరకు చాలా సమస్యలను ఫేస్ చేశామని, అతను క్రిస్టియన్ కావడంతో ఇంట్లో ఒప్పించడం చాలా కష్టంగా మారినట్లు తెలిపింది. నిజానికి ఆమె తన లవ్ మేటర్‌ను స్వయంగా ఇంట్లో చెప్పలేదనీ, అనుకోకుండా తల్లికి అడ్డంగా దొరికిపోయినట్లు చెప్పుకొచ్చింది. ' నేను, ఆంటోనీ ఇంటర్ పూర్తి అవ్వగానే డేటింగ్ స్టార్ట్ చేశాం. ఆ తరువాత ప్రేమలో పడ్డాం. అయితే నాకు అప్పట్లో డైరీ రాసే అలవాటు ఉంది. ఆంటోనీతో కలిసి ఉన్న క్షణాలను డైరీలో రాసుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు ఆ డైరీని అమ్మ చదివేసింది. ఆ తరువాత ఆ డైరీ ఇప్పటివరకు కనిపించలేదు. బహుశా దాన్ని అమ్మ కాల్చి బూడిద చేసి ఉండవచ్చు. ఆ సంఘటన తరువాత నేను డైరీ రాయలేదు.


ఆంటోనీకి నేను హీరోయిన్ కాకముందు నుంచి తెలుసు కాబట్టి.. నన్ను బాగా అర్ధం చేసుకుంటాడు. అతను క్రిస్టియన్ కావడంతో చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటిని అధిగమించి మేము పెళ్లి చేసుకున్నాం' అని చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా కూడా కీర్తి లాంటి స్టార్ హీరోయినే ప్రేమ కోసం లేచిపోవాలని అనుకోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందని, ప్రేమ ఎంతటి వారినైనా మార్చేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కీర్తి సినిమాల విషయానికొస్తే.. అమ్మడికి ఒక మంచి సాలిడ్ హిట్ అనేది చాలా ముఖ్యం. డోరతీ హిట్ అయినా అది కీర్తి ఖాతాలో వేయలేరు. ఇక అక్క కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇవి కాకుండా ప్రస్తుతం కీర్తి చేతిలో సావిత్రి, జనవరి 12 విడుదల తదితర సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ సినిమాల్లో అమ్మడికి ఏ సినిమా సాలిడ్ హిట్ ని ఇస్తుందో చూడాలి.

Also Read:

రజనీ పాత సినిమా టైటిల్‌తో.. సంతానం కొత్త ప్రయోగం

కొత్త ఇంటికి.. సీఎం విజ‌య్‌

సీన్ .. సూర్య హ్యాట్రిక్ పట్టినట్టేనా

Updated Date - Nov 06 , 2026 | 11:39 AM