యాక్షన్, హర్రర్ చిత్రాలకు ఏమాత్రం తేడా లేదు: దర్శకుడు
ABN, Publish Date - Sep 19 , 2026 | 10:34 AM
విజయ్ ఆర్.ఆనంద్ దర్శకత్వంలో రెంటెక్ ఫిల్మ్, లయన్ ఫిలిమ్స్, అన్నై సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కస్తూరి వీడు’. తాజాగా ఈ మూవీ ఆడియో, ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇపుడు యాక్షన్ చిత్రాలకు, దెయ్యాల సినిమాలకు ఏమాత్రం తేడా లేదని ప్రముఖ దర్శకుడు పేరరసు (Perarasu) అన్నారు. విజయ్ ఆర్.ఆనంద్ దర్శకత్వంలో రెంటెక్ ఫిల్మ్, లయన్ ఫిలిమ్స్, అన్నై సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కస్తూరి వీడు’ (Kasthuri Veedu). సముద్రఖని, యోగిబాబు, తంబి రామయ్య, డేవిడ్, ధనుజ, శ్రీ వర్షద్ ఆనంద్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఇందులో ప్రముఖ దర్శకుడు పేరరసుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆడియో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా పేరరసు మాట్లాడుతూ.. ‘‘సముద్రఖని ఇపుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఎక్కడకు వెళ్ళినా ఆయన నటించిన సినిమా పోస్టర్లు, అభిమానులు కనిపిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈ సినిమాలో నటించడం గొప్పవిషయం. ‘కస్తూరి వీడు’ అనేది మహిళ పేరు. ఎంత గొప్ప మగాడైనా తమ ఇంటికి మహిళ పేరే పెడతారు. ఇది ఒక దెయ్యం సినిమానే. ఆధ్యాత్మికత, దెయ్యం, సెంటిమెంట్, సైన్స్ ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
చిత్ర దర్శకుడు విజయ్ ఆర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో ప్రారంభమైంది. సముద్రఖని ఈ ప్రాజెక్టులో చేరిన తర్వాత పెద్ద సినిమాగా మారిపోయింది. హీరో మంచి వ్యక్తి మాత్రమే కాదు.. ప్రతిభావంతుడు కూడా. హీరోయిన్ తనుజ నా స్నేహితుడి కుమార్తె. ఎన్నో కష్టమైన సన్నివేశాల్లో సులభంగా నటించింది. ఆమె నటన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయామని అన్నారు.
సముద్రఖని మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శక నిర్మాతలతో కలిసి ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారీ కొత్త వ్యక్తులతో కలిసి ప్రయాణించడం దేవుడు మనకు ఇచ్చిన వరం అని నేను బలంగా నమ్ముతాను. ప్రతి ఒక్కరికీ నచ్చే కథ ఇది. భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
‘వారణాసి’ కోసం రంగంలోకి నార్వే వీఎఫ్ఎక్స్ దిగ్గజం.. జక్కన్నా, నీకో దండం సామి!
విక్టరీ వెంకటేశ్ అక్టోబర్ సెంటిమెంట్.. మరోసారి కలిసొస్తుందా?
వినాశనం అంతం కాదు.. నూతన శకానికి ఆరంభం: దర్శకుడు పా.రంజిత్