సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అన్బరివ్ మూవీ కంటే ముందే ఆ దర్శకుడితో కమల్ క్రేజీ ఫిల్మ్!

ABN, Publish Date - Jul 26 , 2026 | 09:07 PM

విలక్షణ నటనతో, విభిన్నమైన కథలతో దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న లోకనాయకుడు కమల్ హాసన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు.

Kamal Haasan Next Project Update

విలక్షణ నటనతో, విభిన్నమైన కథలతో దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిభావంతుడైన దర్శకుడు అరుణ్ కుమార్‌తో (S.U. Arun Kumar) ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. విక్రమ్‌తో తెరకెక్కించిన ‘వీర ధీర శూరన్’ వంటి వైవిధ్యమైన, పవర్‌ఫుల్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన అరుణ్ కుమార్, ఇప్పుడు కమల్ హాసన్ కోసం ఒక బలమైన కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.


నిజానికి కమల్ హాసన్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ యాక్షన్ మాస్టర్స్ అన్బరివ్ (Anbariv Masters) దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అయితే, కొన్ని సాంకేతిక కారణాలు, ప్రీ-ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల ఆ ప్రాజెక్ట్ కాస్త వాయిదా పడినట్లు తెలుస్తోంది. డేట్స్ వేస్ట్ కాకుండా ఉండాలనే ఆలోచనతో, వెంటనే అరుణ్ కుమార్ చెప్పిన లైన్‌కు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనేలా కోలీవుడ్‌లో వార్తలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుందని అంటున్నారు.


మరోవైపు కమల్ హాసన్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన పాన్ ఇండియా విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్ అయిన ‘కల్కి పార్ట్-2’లో సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో ఆయన మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారు. దీనితో పాటు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ (#KHxRK) ప్రాజెక్ట్ కూడా కమల్ లైనప్‌లో ఉంది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతూ లోకనాయకుడు స్పీడ్ పెంచడం ఆయన అభిమానులకు మాత్రం పండగే అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

‘స్పిరిట్’లో కత్రినా కైఫ్ రోల్ అదేనా?.. సందీప్ వంగా మాస్టర్ ప్లాన్

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘RC17’ మొదలయ్యేది అప్పుడే!

ఆ అమ్మవార్ల ఆశీస్సులతో.. ‘అగధ’ పబ్లిసిటీ జాతర మొదలు

Updated Date - Jul 26 , 2026 | 09:07 PM