ఆ అమ్మవార్ల ఆశీస్సులతో.. ‘అగధ’ పబ్లిసిటీ జాతర మొదలు

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:04 PM

దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు రూపొందించిన ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రం ‘అగధ’. ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్ పతాకం పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు.

Agadha Team at Balkampet Ellamma - Pochamma Temple

దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు (MS Raju) రూపొందించిన ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రం ‘అగధ’ (Agadha). ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్ పతాకం పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 14 ఆగస్ట్, 2026న భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో పవిత్ర క్షేత్రంలో అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో తమ ప్రచార ప్రయాణాన్ని చిత్రయూనిట్ ప్రారంభించింది. హైదరాబాద్ నగరానికే కాదు.. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న చారిత్రక, ఆధ్యాత్మిక మహా పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ - పోచమ్మ (Balkampet Ellamma - Pochamma) దేవాలయం. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం ప్రతి ఏడాది బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులతో కళకళలాడుతుందనే విషయం తెలియంది కాదు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతుంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సైతం ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ క్షేత్ర విశిష్టతకు నిదర్శనం. ఇప్పుడీ అమ్మవార్ల ఆశీస్సులతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు.


జూలై 26 (ఆదివారం) ‘అగధ’ మూవీ టీమ్ బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి, అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించింది. అనంతరం అక్కడే ‘అగధ’ చిత్ర ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించింది. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఈ బోనాల కోసం ప్రత్యేకంగా అలంకరించుకుని, భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించగా.. దర్శకులు ఎం.ఎస్. రాజు , నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, చిత్ర సమర్పకులు అజయ్ కేఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.వి.ఎన్. సుబ్బరాజు, హీరో శ్రవణ్ రెడ్డి తదితరులు తమ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


agadha.jpg

ఈ సందర్భంగా నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో ఈ తరహా డివైన్ మిస్టిక్ థ్రిల్లర్స్ చిత్రాలలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది మా ‘అగధ’ చిత్రం. ఒక్క పోస్టర్, టీజర్‌తోనే సంచలనంగా మారింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే ఉత్కంఠని ప్రేక్షకుల్లో రేకెత్తించింది. ఎంఎస్ రాజు ఇంతకుముందు నిర్మాతగా తీసిన ‘దేవి’ చిత్రం అన్ని భాషల్లోనూ, అన్ని ఏరియాల్లోనూ ఒక చరిత్ర సృష్టించింది. ఆ వైబ్స్ ఇప్పుడు ‘అగధ’ విషయంలోనూ కనిపిస్తున్నాయి. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్దమౌతున్న ‘అగధ’ పబ్లిసిటీ జాతర ఈ రోజు అమ్మవార్ల సన్నిధిలో మొదలు శుభసూచికంగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ఈ చిత్రం కొంతమేర అమ్మవారి మీద బేస్ అయిన కథ. ఇలా అనుకోకుండా బల్కంపేట అమ్మవార్ల ఆశీస్సులతో ప్రచార జాతర ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. హైరేంజ్ బడ్జెట్ సినిమాల తరహాలోనే, ఈ సినిమాను కూడా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే

రామా ఏంటిది.. ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లా?

బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభం

Updated Date - Jul 26 , 2026 | 04:04 PM