‘స్పిరిట్’లో కత్రినా కైఫ్ రోల్ అదేనా?.. సందీప్ వంగా మాస్టర్ ప్లాన్

ABN , Publish Date - Jul 26 , 2026 | 08:15 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘స్పిరిట్’లో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఓ కీలక పాత్రలో మెరవనుందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఆమె పాత్రకు సంబంధించి కూడా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

Spirit Katrina Role Update

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫౌజీ’, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి-2’తో పాటు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రానున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రంపై సినీ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచే దేశవ్యాప్తంగా అంచనాలను పెంచేసిన హై-వోల్టేజ్ పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రీకరణ ఇప్పటికే సుమారు 40 శాతం పూర్తయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ (Katrina Kaif) ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో మెరవనుందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.


నెట్టింట వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ‘స్పిరిట్’ చిత్రంలో కత్రినా కైఫ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పూర్తిస్థాయి కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండడంతో ఆమె క్యారెక్టర్ కూడా కచ్చితంగా పోలీస్ డ్రెస్‌లోనే ఉంటుందని అభిమానులు గట్టిగా భావిస్తున్నారు. ఆమె స్క్రీన్ టైమ్ పరిమితంగానే ఉన్నప్పటికీ, కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత కలిగిన రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’, నందమూరి బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించే అవకాశం రావడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకు కత్రినా కైఫ్ కానీ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కానీ, మేకర్స్ వైపు నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోనే ఈ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడక తప్పదు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం, ప్రభాస్ - కత్రినా కాంబో వెండితెరపై సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇక ‘స్పిరిట్’ చిత్రంలో కథానాయికగా ‘యానిమల్’ ఫేమ్ తృప్తి డిమ్రి నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ ఒక ముఖ్యమైన పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ప్రభాస్ మునుపెన్నడూ చూడని పక్కా వైల్డ్, మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారనే ప్రచారం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి ‘స్పిరిట్’తో సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘RC17’ మొదలయ్యేది అప్పుడే!

ఆ అమ్మవార్ల ఆశీస్సులతో.. ‘అగధ’ పబ్లిసిటీ జాతర మొదలు

బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే

Updated Date - Jul 26 , 2026 | 08:15 PM