కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘సండియార్’ షూటింగ్ ప్రారంభం.. ‘దశావతారం’ రీ-రిలీజ్!
ABN, Publish Date - Nov 07 , 2026 | 05:29 PM
కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘సండియార్’ షూటింగ్ ప్రారంభమైంది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో అనిరుధ్ సంగీతంతో భారీ బడ్జెట్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరోవైపు కమల్ పది పాత్రల్లో నటించిన ‘దశావతారం’ ఈ నెల 28న 18 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కానుంది.
కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు, తోటి కళాకారులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా 'సండియార్' మూవీ నుంచి మరో పోస్టర్ ను విడుదల చేసిన మేకర్స్ సినిమా షూటింగ్ ను కూడా ఇదే రోజున ప్రారంభించినట్టు ప్రకటించారు. 'చిత్తా, సేతుపతి' వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఎస్.యు. అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ స్వయంగా ఆర్. మహేంద్రన్‌తో కలిసి రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చుతున్నాడు. సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ డిజైన్ చేస్తున్నారు. అమృతా రామ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, సి.ఎస్. బాలచందర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా మరో అప్ డేట్ కూడా వచ్చింది. కమల్ హాసన్ పది ప్రధాన పాత్రలు పోషించిన 'దశావతారం' సినిమా ఈ నెల 28న రీ-రిలీజ్ చేయబోతున్నారు. అప్పట్లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. పద్దెనిమిదేళ్ళ తర్వాత మరోసారి వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఏ తీరున ఆదరిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
వెంకీ విక్టరీకి అనిల్ రావిపూడినే దిక్కా..?
ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే
నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్