‘డీసీ’ బ్లాక్‌బస్టర్ హిట్.. మారన్ సార్ మళ్లీ మొదలెట్టారుగా!
ABN, Publish Date - Sep 10 , 2026 | 10:48 PM
భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడమే కాదు.. అవి ఘన విజయం సాధిస్తే టీమ్‌ను ఊహించని ఖరీదైన కానుకలతో సర్‌ప్రైజ్ చేయడంలో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ స్టైలే వేరు.
భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడమే కాదు.. అవి ఘన విజయం సాధిస్తే టీమ్‌ను ఊహించని ఖరీదైన కానుకలతో సర్‌ప్రైజ్ చేయడంలో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ (Kalanithi Maran) స్టైలే వేరు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టిన సమయంలో రజనీతో పాటు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌లకు లగ్జరీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీసెంట్‌గా విడుదలైన ‘డీసీ’ (DC) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేయడంతో కళానిధి మారన్ మరోసారి అదే తరహాలో తన ఉదారతను చాటుకున్నారు.
‘డీసీ’ చిత్ర విజయానికి ప్రధాన కారకులైన డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ (చిత్రంలో హీరో), అలాగే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌లను కళానిధి మారన్ స్వయంగా కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అనంతరం వారందరికీ సరికొత్త లగ్జరీ బీఎండబ్ల్యూ (BMW) కార్ల తాళాలను కానుకగా అందజేశారు. ఒకేసారి దర్శకులతో పాటు అనిరుధ్‌కు బ్రాండ్ న్యూ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
హిట్ ఇచ్చిన టెక్నీషియన్లను, దర్శకులను ఇలా సముచితంగా గౌరవిస్తూ వారి కష్టానికి తగిన ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చే నిర్మాత కళానిధి మారన్ ఒక్కరేనంటూ నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు అనిరుధ్ వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతూ మరో లగ్జరీ కారును తన గ్యారేజీలో చేర్చుకోవడం విశేషం. ‘డీసీ’ సాధించిన ఈ ఘన విజయం, సన్ పిక్చర్స్ ఇచ్చిన ఈ స్పెషల్ ట్రీట్‌తో చిత్ర బృందం సంబరాల్లో మునిగితేలుతోంది.
ఇవి కూడా చదవండి:
‘ది ప్యారడైజ్’ మాస్ అప్‌డేట్.. రిలీజ్‌పై ఇక నో డౌట్
అప్పుడే ఫస్ట్ బర్త్‌డే.. వాయువ్ తేజ్ ఎంత ముద్దుగా ఉన్నాడో
చైతూ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘ఫౌజీ’ వాయిదా పడినట్టే!