‘ది ప్యారడైజ్’ మాస్ అప్‌డేట్.. రిలీజ్‌పై ఇక నో డౌట్

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:39 PM

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

The Paradise Latest Update

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. ఇటీవల మేకర్స్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటికీ.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ జాప్యం వల్ల సినిమా మళ్లీ వాయిదా పడుతుందేమోనని సోషల్ మీడియాలో, ట్రేడ్ వర్గాల్లో అక్కడక్కడా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజా మాస్ అప్‌డేట్‌తో ఆ రూమర్లన్నింటికీ మేకర్స్ గట్టిగా చెక్ పెడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.


షూటింగ్ పనులు ఇప్పటికే నూటికి నూరు శాతం పూర్తయ్యాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని స్పష్టం చేసిన యూనిట్.. సెప్టెంబర్ 23న గ్రాండ్ ఓవర్సీస్ ప్రీమియర్లతో సెప్టెంబర్ 24న సినిమా పక్కాగా థియేటర్లలోకి వస్తుందని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మొబైల్ ఫోన్ స్క్రీన్‌షాట్ రూపంలో ఉన్న నాని సరికొత్త పవర్‌ఫుల్ పిక్‌ను వదలగా, అది క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ ఫోటోలో నాని ఎన్నడూ చూడని అత్యంత రగ్గడ్, ఊరమాస్ పీరియడ్ అవతారంలో దర్శనమిచ్చారు. పొడవాటి జడలు, గుబురు గడ్డం, రఫ్ అండ్ డార్క్ కాస్ట్యూమ్స్‌తో పాటు నోట్లో జడలను అదిమిపెట్టి పట్టుకుని.. చేతిలో భారీ తుపాకీతో ఇంటెన్స్ లుక్‌లో గురిచూస్తున్న తీరు ఆయన పాత్రలోని రా అండ్ ఎర్తీ వైల్డ్‌నెస్‌ను ప్రతిబింబిస్తోంది.


మరోవైపు విడుదల తేదీపై క్లారిటీ రావడంతో ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనం మొదలైంది. ఇప్పటికే ప్రారంభమైన నార్త్ అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ దూకుడు చూపిస్తూ.. 150K డాలర్ల మార్కును అలవోకగా దాటేశాయి. ఇప్పటివరకు విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అన్ని భాషల నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడంతో సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో భారీ థియేట్రికల్ బజ్ ఏర్పడింది. ఈ అడ్వాన్స్ ట్రెండ్ చూస్తుంటే నాని కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. వాయిదా వార్తలకు తెరదించుతూ వచ్చిన ఈ సాలిడ్ అప్‌డేట్‌తో నాని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి:

అప్పుడే ఫస్ట్ బర్త్‌డే.. వాయువ్ తేజ్ ఎంత ముద్దుగా ఉన్నాడో

చైతూ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘ఫౌజీ’ వాయిదా పడినట్టే!

రెమ్యూనరేషనే లేదన్నారు కదరా.. ‘ఇరుముడి’తో రవితేజ భారీ జాక్‌పాట్

Updated Date - Sep 10 , 2026 | 09:39 PM