అప్పుడే ఫస్ట్ బర్త్‌డే.. వాయువ్ తేజ్ ఎంత ముద్దుగా ఉన్నాడో

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:19 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల గారాలపట్టి వాయువ్ తేజ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Vaayuv Tej 1st Birthday

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavaya Tripathi)ల గారాలపట్టి వాయువ్ తేజ్ (Vaayuv Tej) మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తమ ముద్దుల తనయుడు ఏడాది ప్రాయంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తల్లి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ పోస్ట్‌ను పంచుకున్నారు. వాయువ్ తేజ్ స్పష్టంగా కనిపించే అందమైన ఫోటోలను తొలిసారి అభిమానులతో షేర్ చేసుకుంటూ, ఒక తల్లిగా తన మనసులోని అవధులు లేని ప్రేమను అక్షర రూపంలో వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, లావణ్య పెట్టిన హృద్యమైన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ మెగా అభిమానులను మురిపిస్తున్నాయి.


తన ముద్దుల బాబునుద్దేశించి లావణ్య రాసుకొస్తూ.. ‘‘నా చిన్ని ప్రాణమా.. నన్ను నీ తల్లిగా ఎంచుకున్నందుకు థ్యాంక్యూ. నువ్వు మా జీవితంలోకి రాకముందు ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసనుకున్నాను. కానీ నువ్వు అడుగుపెట్టాక ప్రేమకు అసలైన కొత్త అర్థం తెలిసింది. నా శరీరానికి వెలుపల ఉంటూనే.. నా ఆత్మలో అత్యంత లోతైన భాగంగా మారిన సరికొత్త ప్రేమను నువ్వు పరిచయం చేశావు. నీ చిన్నారి నవ్వులు, చిన్ని చేతులు, కౌగిలింతలతో మా ఇంటిని సంతోషంతో నింపేశావు. నువ్వు నన్ను ఎంతో అందంగా మార్చేశావు. నా శరీరం బయట తిరుగుతున్న నా గుండెకాయవి నువ్వు. నా జీవితానికి దక్కిన అతిపెద్ద వరం, చీకటి రాత్రుల్లో నా వెన్నెలవు, వెలుగుల రోజుల్లో నా సూర్యుడివి నువ్వు. నువ్వే మా ప్రపంచం వాయువ్.. హ్యాపీ ఫస్ట్ బర్త్‌డే మై బేబీ’’ అంటూ ఎమోషనల్ అయ్యారు.


లావణ్య పంచుకున్న ఫొటోల్లో వాయువ్ తేజ్ అమాయకమైన చూపులు, క్యూట్ స్మైల్‌తో కనువిందు చేస్తున్నాడు. బొమ్మల ముందర కూర్చొని బుడిబుడి అడుగులు వేస్తున్నట్లుగా, అమాయకంగా చూస్తున్న ఆ బుడతడి రూపం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ బుల్లి వారసుడికి ‘అచ్చు వరుణ్ తేజ్ పోలికలే వచ్చాయి’, ‘దిష్టి తగలకూడదు.. ఎంత ముద్దుగా ఉన్నాడో లిటిల్ ప్రిన్స్’ అంటూ అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్‌తో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, వరుణ్ - లావణ్య దంపతులకు 10 సెప్టెంబర్, 2025న వాయువ్ జన్మించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

చైతూ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘ఫౌజీ’ వాయిదా పడినట్టే!

రెమ్యూనరేషనే లేదన్నారు కదరా.. ‘ఇరుముడి’తో రవితేజ భారీ జాక్‌పాట్

‘అ’ బ్లడీ హంగర్‌ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే

Updated Date - Sep 10 , 2026 | 09:19 PM