సూర్య కొత్త సినిమా టైటిల్ ఏమిటో తెలుసా!?
ABN, Publish Date - Jun 24 , 2026 | 03:33 PM
సూర్య హీరోగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న సినిమాకు 'సరవేడి' అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ఇప్పుడు ఫస్ట్ కాంబినేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల విడుదలై, ఘన విజయం సాధించిన 'కరుప్పు' (Karuppu) మూవీని తొలిసారి ఆర్.జె. బాలాజీ (RJ Balaji) తో చేశారు సూర్య. ఆ సినిమా ఘన విజయం సాధించింది. కొంతకాలంగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు గ్రాండ్ విక్టరీని అందించింది. అలానే ఇప్పుడు వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్షన్‌లో సూర్య తొలిసారి 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీలో నటిస్తున్నారు. మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సూర్య నటిస్తున్న మరో సినిమా కూడా ఫస్ట్ కాంబినేషనే కావడం విశేషం.
మలయాళంలో 'రోమాంచం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన జీతూ మాధవన్... ఆ తర్వాత 'ఆవేశం' అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ రెండూ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'బాలన్' (Balan) కు కథను అందించింది కూడా జీతూ మాధవనే! ఆయనతో సూర్య ఇప్పుడో సినిమా చేస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ మూవీలో నజ్రియా నజీమ్ కీలకపాత్రను పోషిస్తోంది. దీనిని దీపావళి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే... ఈ యేడాది సూర్య నటిస్తున్న సినిమాలు ఏకంగా మూడు విడుదలైనట్టు అవుతుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సూర్య, జీతూ మాధవన్ చిత్రానికి 'సరవేడి' అనే పేరును పెట్టాలను కుంటున్నారట. 'సరవేడి' అంటే గ్రానైడ్ అని అర్థం. మరి తమిళంలో 'సరవేడి' అని పెట్టి... మిగిలిన భాషల్లో 'గ్రానైడ్' అనే పేరు పెడతారేమో చూడాలి.
ఈ సినిమాలో సూర్య రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడని సమాచారం. సూర్య పోలీస్ ఆఫీసర్ అనగానే 'సింగం' సీరీసే ఎవరికైనా గుర్తొస్తుంది. మరి దానిని మరిపించేలా ఈ సినిమా ఉంటుందేమో చూడాలి. ఏదేమైనా తొలిసారి తనదో సినిమాలు చేస్తున్న దర్శకులు చెప్పే కథల్లో కొత్తదనం ఉండటంతో వారికే సూర్య తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?
పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!
‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్
Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!