సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో సూర్య డైరెక్టర్.. అంతగా ఏమైంది

ABN, Publish Date - Oct 05 , 2026 | 08:41 PM

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శకుడు శివ (Siva) (సిరుతై శివ) పరిచయం అక్కర్లేని పేరు. తమిళంలో అజిత్ కుమార్, సూర్య వంటి స్టార్ హీరోలతో వివేకం, విశ్వాసం, అన్నాత్తే, కంగువ వంటి పాన్-ఇండియా విజువల్ వండర్స్‌ను తెరకెక్కించిన ఈ స్టార్ డైరెక్టర్..ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.

Director Siva

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శకుడు శివ (Siva) (సిరుతై శివ) పరిచయం అక్కర్లేని పేరు. తమిళంలో అజిత్ కుమార్, సూర్య వంటి స్టార్ హీరోలతో వివేకం, విశ్వాసం, అన్నాత్తే, కంగువ వంటి పాన్-ఇండియా విజువల్ వండర్స్‌ను తెరకెక్కించిన ఈ స్టార్ డైరెక్టర్..ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. తెలుగులో కూడా శివ పలు సినిమాలతో మెప్పించాడు. గోపీచంద్ తో శౌర్యం, రవితేజతో దరువు లాంటి సినిమాలు తెరకెక్కించాడు. ఈ సినిమాలు ఆయనకు ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి.


ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా శివ ఫోటోలు సోషల్ మీడియాలో చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇన్నాళ్లూ కాస్త బొద్దుగా, భారీ శరీరంతో ఉండే దర్శకుడు శివ.. ఒక్కసారిగా బక్కచిక్కి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఆయనకు ఏమైంది? ఏదైనా అనారోగ్య సమస్యా? లేక కాన్షియస్‌గా బరువు తగ్గాదా? అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే.. ఇది ఆరోగ్య సమస్య వల్ల జరిగింది కాదు, కేవలం ఆయన సొంత ఫిట్‌నెస్ జర్నీఅని టాక్ నడుస్తోంది. గతంలో నటుడు అజిత్ ఇచ్చిన సలహాతో పాటు క్రమశిక్షణతో కూడిన డైట్, వర్కవుట్స్ ద్వారా ఆయన గణనీయంగా బరువు తగ్గాడట. కంగువ ప్రమోషన్స్, ఆ తర్వాత జరిగిన ఈవెంట్స్‌లో కనిపించిన ఆయన మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. సినీ పరిశ్రమలో నిరంతరం ఉండే ఒత్తిడి, షూటింగ్ షెడ్యూల్స్ మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆయన వెయిట్ లాస్ డైట్ పాటించి బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి బక్కచిక్కి సన్నగా మారిన శివ కొత్త లుక్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

కాకాకి గట్టి విలనే దొరికాడుగా..

Jailer 2: టైగర్.. ముత్తువేల్ పాండియన్ మళ్లీ వచ్చాడు

అనిల్ రావిపూడి.. అసలు ఏం టాలెంటయ్యా నీది

Updated Date - Oct 05 , 2026 | 08:48 PM