భారతీరాజా అంత్యక్రియల్లో తీవ్ర కలకలం.. బంధువులపై మ్యూజిక్ డైరెక్టర్ ఆగ్రహం
ABN, Publish Date - Jun 10 , 2026 | 04:50 PM
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా (Bharathiraja) మృతి.. సినిమా ఇండస్ట్రీని మొత్తం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. రచయితగా, దర్శకునిగా, నటునిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయకునిగా పలు విధాల ప్రతిభను చాటుకున్న ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా (Bharathiraja) మృతి.. సినిమా ఇండస్ట్రీని మొత్తం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. రచయితగా, దర్శకునిగా, నటునిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయకునిగా పలు విధాల ప్రతిభను చాటుకున్న ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. చెన్నైలోని నీలాంకరై నివాసంలో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ సమయంలోనే భారతీరాజా భౌతికకాయం వద్ద తీవ్ర కలకలం రేగింది.ప్రముఖ సింగర్, నటుడు, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ గంగై అమరన్.. భారతీరాజా భార్యపై మండిపడడం హాట్ టాపిక్ గా మారింది.
84 ఏళ్ళ వయస్సులో భారతీరాజా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన భార్య చంద్రలీలావతి.. భారతీరాజాతో ఉండడం లేదట. దీంతో ఆయన ఒంటరిగానే ఇంట్లో ఉన్నారట. ఇప్పుడు ఆయన మరణించాక భార్య వచ్చి నువ్వు నన్ను వదిలివెళ్ళిపోయావా అని ఏడుస్తుంటే.. అక్కడే ఉన్న గంగై అమరన్ వారిపై మండిపడ్డారు. 'చివరి రోజుల్లో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ రాలేదు. చివరికి అందరూ ఆయనను ఒంటరిగా వదిలేసి పారిపోయారు కదా.. ఆయన ఎంత అసహాయ స్థితిలో కన్నుమూశారో మీకు తెలుసా? ఇప్పుడు మాత్రం అందరూ చుట్టూ చేరారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బంధువులు సైతం.. మీకు తెలియదు అని గంగై అమరన్ పై అరిచారు. ఇక వెంటనే రాధిక కలుగజేసుకొని గంగై అమరన్ ని పక్కకు తీసుకెళ్ళడంతో గొడవ సద్దుమణిగింది. ఇక మీడియా ముందు అయన మాట్లాడుతూ.. 'అలాంటి వ్యక్తి ఇక లేరని వినడానికి చాలా బాధగా ఉంది. నేను మాట్లాడలేకపోతున్నాను. ఆయన ఇక లేరు. ఆయన చేసిన పనిని చూసి మనం సంతోషించాలి' అంటూ చెప్పుకొచ్చాడు. ఎలాంటి సినిమాలు చేసి.. ఎంత పేరు సంపాదించుకొని.. చివరికి భారతీరాజా ఒంటరిగా మరణించారు. ఈ విషయం తెలియడంతో అభిమానులు కంటనీరు పెట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా
భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!