కోలీవుడ్‌కు మరో టాలీవుడ్ హీరోయిన్ జంప్
ABN, Publish Date - Oct 09 , 2026 | 10:12 AM
ఇప్పటికే తెలుగు అమ్మాయిలు ఎందరో తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకుని, బిజీ నటీమణులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఈ లిస్ట్‌లో చేరింది.
మరో టాలీవుడ్ హీరోయిన్ కోలీవుడ్‌కు వెళ్లిపోతుందా? అంటే అవునని చెప్పక తప్పదు. ఇప్పటికే తెలుగు అమ్మాయిలు ఎందరో తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకుని, బిజీ నటీమణులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఈ లిస్ట్‌లో చేరింది. ఆమె ఎవరో కాదు.. ఫరియా అబ్ధుల్లా (Faria Abdullah). తమిళ చిత్రపరిశ్రమలోకి మంచి విజయంతో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదని అది ‘సిగ్మా’ (Sigma)తో నెరవేరిందని, ఇకపై కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంటానని తాజాగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా అన్నారు.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఫరియా.. తన నటనతో పాటు సృజనాత్మక ప్రతిభతో రాణిస్తున్నారు. బాల్యం నుంచే నృత్యంపై ఎంతో ఆసక్తి ఉన్న ఆమె.. స్టూడియో, స్ట్రీట్ డ్యాన్స్ వంటి నృత్యంపై శిక్షణ పొందారు. హైస్కూల్ రోజుల్లో ఆమెకు లలిత కళలు, సాహిత్యం వంటి వాటిపై ఆసక్తి ఉండేది. ఆ తర్వాత మాస్ కమ్యూనిషన్స్ పూర్తి చేసిన ఫరియా.. ఆరేళ్ళకుపైగా థియేటర్, స్టేజ్ షోలో ప్రత్యేక శిక్షణ పొందారు. నటనతో పాటు గత రెండేళ్ళుగా ర్యాప్ సంగీతం, మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందిస్తూ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.
ఇటీవల ఒక మ్యూజిక్ వీడియో నిర్మించడం ద్వారా కెమెరా వెనుక తన మూవీ జర్నీలో మరో ముఖ్యమైన అడుగు వేశారు. తాజాగా ‘సిగ్మా’తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా.. ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో ఒక చిత్రం. విజయ్ ఆంటోనీ హీరోగా నటించే మరో చిత్రంలో నటించారు. మున్ముందు కూడా మంచి కథలను ఎంచుకుని కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాలకు చోటు సంపాదించుకుంటానని ఫరియా అబ్దుల్లా చెబుతున్నారు. సో.. మరో టాలీవుడ్ హీరోయిన్ కోలీవుడ్‌కు జంపన్నమాట.
ఇవి కూడా చదవండి:
కిలికిని మించి.. ‘వారణాసి’ కోసం జక్కన్న ‘బాహుబలి’ స్ట్రాటజీ!
రాజ్యసభ వైపు రజనీకాంత్ వైఫ్ లత అడుగులు..!
హానెస్టీ ‘అహంకారం’గా.. ఆత్మవిశ్వాసం ‘బలుపు’గా అనిపిస్తే.. నేను తగ్గాలా?: విజయ్ దేవరకొండ