Director Shankar : కెప్టెన్లంతా కలిశారు
ABN , First Publish Date - 2023-08-05T00:02:37+05:30 IST
తమిళ దర్శకుడు శంకర్ చిత్ర పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా దర్శకుడు మణిరత్నం, ఆయన భార్య సుహాసినీ ఓ ప్రత్యేక విందు ఏర్పాటు చేసి దర్శకులందరినీ ఆహ్మానించారు.

తమిళ దర్శకుడు శంకర్ చిత్ర పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా దర్శకుడు మణిరత్నం, ఆయన భార్య సుహాసినీ ఓ ప్రత్యేక విందు ఏర్పాటు చేసి దర్శకులందరినీ ఆహ్మానించారు. ఈ పార్టీకి లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, లింగుసామి, శశి, ఎ.ఆర్.మురుగదాస్, గౌతమ్ వాసుదేవ మీనన్ తదితరులు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ పార్టీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘థాంక్యూ మణి సార్. ఈ అందమైన సాయంత్రాన్ని నేను మరచిపోలేను. నా మిత్రులందరితో సరదాగా మాట్లాడడం, ఇళయరాజా, రెహమాన్ మధుర గీతాలు పాడుకోవడం.. సూపర్. ఈ మధుర క్షణాలే నిజమైన సంపద, అది మేం సంపాదించాం’ అంటూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు శంకర్.