Director Shankar: రామ్ చరణ్‌‌లో ఏదో తెలియని శక్తి ఉంది.. అతనొక విస్ఫోటనం

ABN , Publish Date - Dec 19 , 2024 | 06:08 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌లో ఏదో తెలియని శక్తి ఉందని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోన్న నేపథ్యంలో ఈ సినిమాలో రామ్ చరణ్‌ని తీసుకోవడానికి గల కారణాన్ని శంకర్ చెప్పుకొచ్చారు. శంకర్ ఏం చెప్పారంటే..

Director Shankar and Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి, ఆ పాత్రకు రామ్ చరణ్‌ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని శంకర్ చెప్పుకొచ్చారు.

Game-Changer-3.jpg

‘‘RRR రిలీజ్‌కి ముందే ఈ సినిమా చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారు. నాకు కూడా అదే పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. నా కథలలో యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. కాబట్టి ఓ పెద్ద హీరో అయితే బాగుంటుందని భావించి రామ్ చరణ్‌తో ప్రయాణం ప్రారంభించాం.


Game-Changer-1.jpg

రామ్ చరణ్‌ని చూస్తే.. లోలోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. టైం, సందర్భంగా వచ్చినప్పుడు ఆ శక్తి విస్ఫోటనం చెందుతుందా? అన్నట్టుగా ఉంటుంది. డీప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్ట్. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రామ్ చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా, అందంగా హ్యాండిల్ చేస్తారు’’ అని శంకర్ తెలిపారు.

అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ ఇందులో కనిపించనున్నారు. టీజర్‌లో రకరకాల గెటప్స్, డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న రామ్ చరణ్‌ను చూపించగా.. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా అద్భుతంగా ఉండబోతోందని టీజర్ హింట్ ఇచ్చేసింది. రామ్ చరణ్‌తో పాటు గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ, ఎస్‌ జె సూర్య, సముద్రఖని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.


Game-Changer-2.jpg

ఒకవైపు మేకర్స్ సినిమా ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాలోని ‘జరగండి’, ‘రా మచ్చా’, ‘నానా హైరానా’ పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలవగా.. నాలుగో పాట అయిన ‘డోప్’ను డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన డోప్ ప్రోమో అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. థమన్ సంగీతం, తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ, శంకర్ మేకింగ్‌తో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌ సక్సెస్ అందుకోవడం పక్కా అనేలా వస్తున్న అప్డేట్స్‌తో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read-Mohan Babu: మోహన్ బాబుకి షాకిచ్చిన హైకోర్టు

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 19 , 2024 | 06:18 PM