Suriya: ఈ ఏడాది రెండు హిట్లు.. మూడో సినిమాపై గురి..
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:35 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు (Suriya) ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న ఆయన.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు (Suriya) ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న ఆయన.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే ‘సీన్’ (Scene) ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంటే సూర్య ఖాతాలో ఈ ఏడాది హ్యాట్రిక్ విజయాలు చేరినట్లే. దీంతో అభిమానుల దృష్టి ప్రస్తుతం ఈ చిత్రంపైనే ఉంది.ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుప్పు’ ఈ ఏడాది మేలో విడుదలై సూర్యకు మంచి విజయాన్ని అందించింది. మాస్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మరోసారి సూర్యకు విజయాన్ని అందించింది. ఇలా భిన్నమైన కథలతో వచ్చిన రెండు సినిమాలు మంచి ఫలితాలు సాధించడంతో సూర్య జోరు కొనసాగుతోంది.
ఇప్పుడు ‘సీన్’తో ఈ విజయ పరంపరను కొనసాగించాలని ఆయన చూస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. డీఎస్పీ ఇన్బరాజ్ పాత్రలో ఆయన చేసే హుంగామ యాక్షన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుందని గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా, నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు విజయాలను అందుకున్న సూర్య.. మూడో సినిమాతోనూ ప్రేక్షకులను మెప్పిస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ‘సీన్’ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే ఈ ఏడాది సూర్యకు హ్యాట్రిక్ సొంతమవుతుంది. మరి.. జీతూ మాధవన్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
ALSO READ:
Sanjay Gupta: ‘కాంటే’, ‘కాబిల్’ చిత్రాల దర్శకుడు ఇకలేరు..
Ritika Singh: అవన్నీ ఫేక్ వీడియోలు.. దయచేసి నమ్మకండి..
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కు మ్యూజికల్ ట్రీట్.. ‘దాదా’ అప్డేట్