Ritika Singh: అవన్నీ ఫేక్ వీడియోలు.. దయచేసి నమ్మకండి..

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:27 AM

తన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నటి రితిక సింగ్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించడం, వారి ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేయడం అవి వైరల్ కావడం ఎక్కువగా చూస్తున్నాం. ఈ  టెక్నాలజీతో  చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు పోరాటం చేసి.. అవి ఫేక్ అని నిరూపించుకున్నారు. కొందరు ఐతే సైలెంట్ గా ఊరుకున్నారు.  తాజాగా నటి రితికా సింగ్ (Rithika Singh) కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. తన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఫాలో  అవుతున్న అభిమానులను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె కీలక హెచ్చరిక చేశారు. 


“కొందరు వ్యక్తులు నా పేరుతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అభిమానులను మోసం చేస్తున్నారు. ప్రత్యేకమైన కంటెంట్ అందిస్తామంటూ సబ్‌స్క్రిప్షన్ పేరుతో నెలకు రూ.400 వసూలు చేస్తున్నారు. దయచేసి ఇలాంటి నకిలీ ఖాతాలను నమ్మి ఎవరూ డబ్బులు చెల్లించవద్దు. అంతేకాకుండా, నా పేరుతో ప్రచారంలో ఉన్న కొన్ని వీడియోలు కూడా నిజమైనవి కావు. అవి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు. టెక్నాలజీ సాయంతో నా ముఖాన్ని ఇతర వీడియోలకు జోడించి తప్పుడు కంటెంట్ సృష్టిస్తున్నారు. అలాంటి వీడియోలను చూసి నిజమని భావించవద్దు. నా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు బ్లూ టిక్ ఉంటుంది. కాబట్టి బ్లూ టిక్ ఉన్న అకౌంట్‌ను మాత్రమే ఫాలో అవ్వండి. నా పేరుతో కనిపించే ఇతర నకిలీ ఖాతాలకు దూరంగా ఉండండి. అలాంటి ప్రొఫైల్స్ మీకు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. ముఖ్యంగా సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బులు అడిగే అకౌంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అభిమానులను కోరుతున్నాను” అని రితికా సింగ్ వెల్లడించారు.

ALSO READ:
IFFA: ఐఫా వేడుకల్లో ధురంధర్ జోరు.. రణ్‌వీర్‌కు ఉత్తమ నటుడి పురస్కారం!

DSP: దేశవ్యాప్తంగా ఫోక్ ఆర్టిస్టులు ఒక్కచోట.. ‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ స్పెషల్!

సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్‌ చేశారేంటి?

Updated Date - Oct 31 , 2026 | 11:37 AM