కొన్నిసార్లు.. మంచి జరగడానికి సమయం పడుతుంది

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:41 AM

కొన్నిసార్లు మంచి జరగడానికి సమయం పడుతుందని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి అన్నారు.

Aishwarya Lekshmi

కొన్నిసార్లు మంచి జరగడానికి సమయం పడుతుందని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) అన్నారు. ఆమె ప్రధాన పాత్ర పోషిం చిన వెబ్ సిరీస్ లవ్ (#Love) . వచ్చే నెల 2వ తేదీ నుంచి నెటిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సౌందర్య రజనీకాంత్ (Soundarya Rajinikant) నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు బాలాజీ మోహన్ (Balaji Mohan) దర్శకత్వం వహించారు. ఆధునిక ప్రేమ, సంబంధాల నేప‌థ్యంలో రూపొందించిన‌ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

ఇందులో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ, 'ఇందులో తారా పాత్ర పోషించడం నాకు చాలా స్వేచ్ఛనిచ్చింది. సంతోషాన్ని కలిగించింది. నన్ను 80 శాతం మంది తారాతో పోల్చుకోవ‌చ్చు. ఇందులో నేను అస్సలు నటించలేదు. కేవలం ఆ పాత్రలో లీనమైపోయాను. గతంలో నేను పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర‌ ఉంటుంది.

అలాగే, ప్రేమ కథలో నటించాలనే కోరిక ఎప్ప‌టినుంచో ఉండేది. దానికి ఈ 'లవ్' గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. గతంలో అర్జున్ దాస్ (Arjun Das) తో కలిసి నటించే అవకాశం కోల్పోయాను. అది ఇప్పుడు. లవ్‌తో నెరవేరింది. కొన్నిసార్లు మంచి విష‌యాలు జరగడానికి సమయం పడు తుంది' అని పేర్కొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 12:04 PM