ఒక బిలియన్ డాలర్లు.. బాక్సాఫీస్ వద్ద ‘మైఖేల్’ సరికొత్త చరిత్ర
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:00 PM
ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు, సినిమా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హాలీవుడ్ చిత్రం ‘మైఖేల్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది.
ప్రపంచ సినిమా చరిత్రలో బయోపిక్‌లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గత కొంతకాలంగా దేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ తరహా చిత్రాల మార్కెట్ నిలకడగా ఎదుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు, సినిమా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హాలీవుడ్ చిత్రం ‘మైఖేల్’ (Michael Movie) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది. పాప్ ప్రపంచపు దిగ్గజం, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ (Michael Jackson Biopic) ఆధారంగా రూపొందిన ఈ మ్యూజికల్ డ్యాన్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్‌ను దాదాపు పూర్తి చేసుకునే తరుణంలో ఎవరూ ఊహించని రేంజ్‌లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ బయోపిక్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఒక బిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును (Michael Movie Collections) దాటి సరికొత్త చరిత్రను లిఖించింది. సినిమా చరిత్రలోనే ఈ స్థాయి వసూళ్లను సాధించిన మొట్టమొదటి బయోపిక్ చిత్రంగా ‘మైఖేల్’ రికార్డు సృష్టించింది. ఈ వసూళ్లను మన భారతీయ కరెన్సీలో పోల్చి చూస్తే.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు రూ. 9500 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఒక రియల్ లైఫ్ పర్సన్ ఆధారంగా తెరకెక్కిన డ్రామా ఇంత భారీ ఎత్తున రెవెన్యూ జనరేట్ చేయడం బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలను సైతం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన ప్రారంభంలో విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అంతగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకోలేదు, మిశ్రమ స్పందనలనే మూటగట్టుకుంది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మైఖేల్ జాక్సన్ పేరుకున్న విపరీతమైన క్రేజ్, ఇప్పటి తరం యువతలో ఆయనకున్న పాప్ సిగ్నిఫికెన్స్, అశేష అభిమాన బలగమే ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టిందని చెప్పాలి. చాలా పరిమితమైన, రీజనబుల్ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టడంతో, అత్యధిక లాభాలను ఆర్జించిన ప్రపంచంలోని మోస్ట్ ప్రాఫిటబుల్ చిత్రాల జాబితాలో చేరి.. సరికొత్త చరిత్రను లిఖించింది.
ఇవి కూడా చదవండి:
రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల
నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్
కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ