మోస్ట్ బ్యాచిలర్ హీరో సరసన రుక్మిణి
ABN, Publish Date - Apr 07 , 2026 | 11:20 AM
యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు (Rukmini Vasanth) లక్కీఛాన్స్ లభించింది.
యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు (Rukmini Vasanth) లక్కీఛాన్స్ లభించింది. కోలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో శింబుకు (Simbu) జోడీగా నటించనున్నారు. ‘అరసన్’ మూవీని పూర్తి చేసిన శింబు.. ఇపుడు అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuttu) దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ భారీ బడ్జెట్‌తో నిర్మించే ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
కాగా, విజయ్ సేతుపతి నటించిన ‘ఏస్’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన రుక్మిణి.. ఆ తర్వాత ‘మదరాసి’లో శివకార్తికేయన్ సరసన నటించారు. ప్రస్తుతం ఆమె రెండు చిత్రాల్లో బిజీగా ఉండగా, ఇపుడు శింబు సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రంలో సూపర్‌హిట్ కాంబోగా గుర్తింపు పొందిన శింబు - సంతానం కలిసి నటిస్తున్నారని దర్శకుడు అశ్వత్ వెల్లడించారు.
ALSO READ: రికార్డులను తిరగరాయాలనే పట్టుదలతో తారక్
విఘ్నేష్ శివన్ : ధనుష్ స్నేహాన్ని కోల్పోవడం బాధగా ఉంది
అనిల్ రావిపూడిని వణికించిన బాలయ్య సినిమా..